సుమన్ భార్య చిత్ర పరిశ్రమకు చెందిన వారే..: ఎవరో తెలుసా..?

1980 కాలంలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ ల హవా సాగుతోంది. ఈ క్రమంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సుమన్ తెలుగు హీరోలకు పోటీనిచ్చారు. ఒక దశలో మెగాస్టార్ చిరంజీవికి ఆయన పోటీగా మారారన్న చర్చ సాగింది. ఆయితే ఆయన కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాట్ చేసి మళ్లీ స్టార్ హీరో అయ్యాడు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరుడి పాత్రలో సుమన్ ను చూస్తే.. సాక్షాత్తూ శ్రీవారు అలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అంతటి మహా నటుడైన సుమన్ కు తన సతీమణి వల్లే అదృష్టం లభించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే సుమన్ భార్య సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుడి మనువరాలు. ఇంతకీ ఆమె ఎవరంటే..?

ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారిడిగా ఉండేవారు సుమన్. ఆయన సినిమాల కోసం ఎదురుచూసిన వారు ఎందరో ఉన్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన సుమన్ తెలుగులో ‘తరంగిణి’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. శాండిల్ వుడ్ కంటే టాలీవుడ్లోనే ఆయనకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ అన్నింటిలో కలిపి 150 సినిమాల్లో నటించిన ఆయన స్టార్ హీరోలకు పోటీ నిచ్చారు. ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి.

సుమన్ కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన నిర్దోషి అని తీర్పు రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో విలేకరులతో మాట్లాడుతూ కొందరు నాపై రాజకీయంగా కుట్ర చేశారని ఆరోపించారు. ఈ సమయంలోనే ప్రముఖ డైరెక్టర్, రైటర్ డి.వి.నరసరాలు తన మనువరాలు శిరీషను సుమన్ కు ఇచ్చి పెళ్లి చేశారు. సుమన్ పెళ్లికి ముందు జైలుకు వెళ్లినా నిర్దోషి అని తేలడంతో ఆయనకు పెళ్లి జరిపించారు.

పెళ్లి తరువాత సుమన్ కు అదృష్టం కలిసొచ్చింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. పెళ్లయిన తరువాత మళ్లీ సినీ ఎంట్రీ ఇచ్చారు. మొండిమొగుడు పెంకి పెళ్లాం, బావ బామ్మర్ది, పెద్దింటి అల్లుడు వంటి సినిమాలు చేసి స్టార్ అయ్యారు. కొన్ని సంవత్సరాల తరువాత అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు. అన్నమయ్య, రామదాసు సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక శివాజీ సినిమాలో విలన్ గా చేసి అందరినీ మెప్పించారు.

Leave a Comment