God Father Movie Review : గాడ్ ఫాదర్ మూవీ ఫుల్ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఇష్టముండని వారుండరు. కానీ ఆయనకు ఇటీవల వరుస ప్లాపులు దక్కాయి. దీంతో మెగాస్టార్ ఒక్క హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు మంచి మాస్ సినిమాతో దసరా పండుగ రోజున థియేటర్లోకి వచ్చాడు. మలయాళ మూవీ లూసీఫర్ మూవీ రీమేక్ గా తీసిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఐదు భాషల్లో రిలీజైన ఈ మూవీ గురించ ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. ఇంతకాలం మాస్ యాంగిల్ లో చిరును చూడాలని ఫ్యాన్స్ ఎంతోకాలంగా కోరుకుంటున్నారు. అయితే దసరా సందర్భంగా మంచి బిర్యానీ తినిపించాడన్న చర్చ సాగుతోంది. ఇందులో చిరంజీవికి తోడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తోడవ్వడం మూవీకి మరింత బూస్టునిచ్చినట్లయిందని అంటున్నారు. ఇంతకీ సినిమా విశేషాలేంటో చూద్దాం..

నటీనటులు:
చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, జయదేవ్, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్.

సాంకేతికం:
డైరెక్ట్: మోహన్ రాజా

నిర్మాత: ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్, ఆర్ బీ చౌదరి

మ్యూజిక్: థమన్

మాటలు: లక్ష్మీ భూపాల

డ్యాన్స్: ప్రభుదేవా

ఎడిటింగ్: ముర్తాండ కె. వెంకటేశ్

కథ:
గాడ్ ఫాదర్ టోటల్ గా పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు. ఒక పొలిటికల్ గాడ్ ఫాదర్ (పీకేఆర్) వారసత్వం కోసం కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఎవరి ప్రయత్నాలు సాగవు. కానీ పీకేఆర్ కు ఇష్టమైన బ్రహ్మ( చిరంజీవి) పేరు బయటకు వస్తుంది. ఆయనే గాడ్ ఫాదర్ వారసత్వాన్ని పుచ్చుకోవాలని చాలా మంది ఆశిస్తుంటారు. కానీ ఈయన వారసత్వాన్ని కొందరు ఒప్పుకోరు. అందులో గాడ్ ఫాదర్ కూతురు సత్యప్రియ( నయనతార) బ్రహ్మ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండి ఆతనికి వారసత్వాన్ని దక్కకుండా అడ్డుకుంటుంటి. అయితే బ్రహ్మ గాడ్ ఫాదర్ కుటుంబ సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందులో జై దేవ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది.. అయితే ఈ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది..? సత్యప్రియ బ్రహ్మ పట్ల ఎందుకు అసంతృప్తితో ఉంటుంది.. అనేది వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
మాలయాళ మూవీ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ ను తెలుగు నేటీవిటీగా తగ్గట్లుగా తీశారు. ఇప్పటి వరకు పొలిటిక్ డ్రామాలు చాలానే హిట్టయ్యాయి. చిరంజీవి పూర్తిగా పొలిటికల్ లీడర్ గా కనిపించలేదు. కానీ గాడ్ ఫాదర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. మలయాళ మూవీకి కొన్ని మార్పులు చేశారు. ఇక ఇందులో అందరూ సీనియర్ నటులే ఉండడంతో సినిమా బోర్ కొట్టకుంటానే సాగుతుంది. కానీ సెకండాఫ్ లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇవ్వడంతో కొంత జోష్ కలుగుతుందనే చెప్పొచ్చు. కొన్ని డల్ సీన్స్ తో కథ స్లోగా మూవ్ అవుతుంది. అయినా రాజకీయ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మరో విశేషమేంటంటే ప్రముఖ డైరెక్టర్ ఇందులో ఇన్విస్టిగేషన్ జర్నలిస్టుగా ఎంట్రీ ఇస్తారు. మొత్తంగా దసరా సందర్భంగా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు మంచి సినిమానే అందించినట్లు అర్థమవుతోంది. అయితే ఆచార్య మూవీ లాగా గాడ్ ఫాదర్ మాత్రం నిరాశ పర్చదని చెప్పొచ్చు.

 

Leave a Comment