హీరోయిన్ రంభ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది హీరోయిన్లు కొంతకాలం మాత్రమే హడావుడి చేస్తారు. ఆ తరువాత కొందరు పెళ్లి చేసుకొని.. పిల్లలు పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్స్, డ్యాన్స్, కామెడీ షోల్లో జడ్జీలుగా వ్యవహరిస్తు కొనసాగుతున్నారు. మరికొందరు ఇండస్ట్రీ వద్దనుకొని ఫ్యామిలీకే తమ జీవితాన్ని అంకితం చేశారు. అలాంటి హీరోయిన్లలో రంభ ఒకరు. అలనాటి అగ్రహీరోలందరితో నటించిన రంభ హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ భామ. అయితే పెళ్లయిన తరువాత మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి. మరి రంభ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా గురించి నేటి ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ బంపర్ హిట్టు కొట్టిన సినిమా ఇది. ఈ సినిమాతో రంభకు స్టార్ డమ్ లభించింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లు రావడంతో వెనుదిరిగి చూడకుండా సినిమాల్లో నటించేవారు. చిన్న హీరో, పెద్దహీరో అని చూడకుండా ప్రతి ఒక్కరితో కలిసి నటించిన ఆమె కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నారు. హీరోయిన్ గానే కాకుండా ‘యమదొంగ’ సినిమాలో నాచోరే అన్న సాంగ్ లో రంభ చేసిన నృత్యాన్ని ఎవరూ మరిచిపోరు.

2008లో చివరిసారిగా ‘దొంగ సచ్చినోళ్లు’ అనే సినిమాలో కనిపించన రంభ ఆ తరువాత మళ్లీ ఇండస్ట్రీ వైపు చూడలేదు. 2010లో కెనడాకు చెందిన ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. కెనడాకు వెళ్లిన తరువాత ఇంటికే పరిమితమైన రంభ ప్రస్తుతం చాలా మారిపోయింది. పెళ్లయిన తరువాత కొన్నాళ్ల కిందట డ్యాన్స్ షో లో మెరిసినా ఎక్కవగా ఫ్యామిలీకే ప్రిఫరెన్స్ ఇచ్చారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి కెనడా వెళ్లినప్పుడు రంభ ఫ్యామిలీని కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. రంభ సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమెకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముగ్గురు పిల్లల తల్లి అయినా రంభలో ఏమాత్రం అందం తగ్గలేదు. అంతే చిరునవ్వుతో కినిపిస్తున్న ఆమెను చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Leave a Comment