బుగ్గలు బూరెల్లా ఉన్న ఈ చిన్నారి ఏ స్టార్ నటినో తెలుసా..?

సోషల్ మీడియా పుణ్యామాని కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరుణంలో కొందరు సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు తమ చిన్ననాటి ఫొటోలను నెట్లో పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. ఇప్పుడు హీరో, హీరోయిన్ అయిన వారు తమ చిన్ననాటి ఫొటోలను బయటికి తీస్తున్నారు. అలాగే కొందరు హీరోయిన్లు తమ చిన్ననాటి ఫొటోలను బయపెడుతూ అలనాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ భామ కు సంబంధించిన చిన్ననాటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. బూరె బుగ్గలతో ఉన్న ఈ చిన్నారిని చూసి తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో చూద్దాం..

చాలా మంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఆ తరువాత ఇతర పరిశ్రమల్లో కొనసాగుతున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది రాశిఖన్నా. ఆ తరువాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే మిగతా హీరోయిన్ల పోటీకి తట్టుకోని ఆమె కొన్నాళ్లపాటు తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడా బాగానే అవకాశాలు వచ్చాయి. ఇటీవల నాగచైతన్య తో కలిసి ‘థ్యాంక్యూ’ సినిమాలో కనిపించింది.

1990 నవంబర్ 30న జన్మించిన రాశిఖన్నా వెండితెరపై కనిపించడమే కాకుండా ప్లేబ్యాక్ సింగర్ గా కూడా కొనసాగారు. 2013లో మొదటిసారి ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగు, తమిళం సినిమాల్లో కొనసాగారు. ఇటీవల సినిమాల్లో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో పలు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. ఎటువంటి పాత్రలోనైనా ఇమిడిపోయే తత్వం రాశిఖన్నది.

ఇక ఈమెకు సంబంధించిన చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బూరెల్లా ఉండే బుగ్గల అందంతో ఆకట్టుకునే రాశిఖన్నా ఇప్పటికీ అందంగానే ఉంటుంది. ఇక ఆమె చిన్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతలా కష్టపడొద్దని ఆ భామ తన చిన్ననాటి ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఇంకేముంది అభిమానులు ఈ ఫొటోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంతో ఉందని అంటున్నారు.

Leave a Comment