నదియా కూతుళ్లను చూస్తే నిద్రపట్టకపోవడం ఖాయం..!

అందం, అభినయంతో ఆకట్టుకునే కొందరు హీరోయిన్లను వెండితెరపై చూసి ఎంతో మురిసిపోతాం. వారు మళ్లీ మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటాం. కానీ కొన్ని కారణాల వల్ల సినీ ఇండస్ట్రీని వదిలి పర్సనల్ లైఫ్ ను షేర్ చేసుకుంటారు. అయితే కొందరు పెళ్లయిన తరువాత కూడా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా కనిపించి ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో నదియా ఒకరు. నదియా తెలుగు కంటే తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ గా చేశారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తెలుగులోనే ఎక్కువగా నటిస్తున్నారు. తెలుగు అత్తగా తన నటనతో ఆకట్టుకుంటున్న నేటి ప్రతీ సినిమాల్లో నదియా తప్పనిసరిగా ఉంటోంది. అప్పటికీ.. ఇప్పటికీ.. నదియా వన్నెతరగని అందంతో కనిపిస్తూ ఉంటే.. ఆమె కూతుళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. లెటేస్టుగా వారికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

actress nadiya daughter

నదియా అసలు పేరు జరీనా. 1984లో ఓ మలయాళ సినిమా ద్వారా ఫిల్మ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత తమిళ సినిమాల్లోకి వెళ్లింది. 1988లో బజార్ రౌడీ అనే సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది నదియా. అయితే తెలుగు కంటే ఇతర ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేసిన నదియా ఆ తరువాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ ప్రభాస్ నటించిన మిర్చి సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

ఇక అప్పటి నుంచి నదియా దాదాపు ప్రతీ సినిమాలో కనిపిస్తోంది. తల్లిగా, అత్తగా, అక్కగా.. ఇలా ఏ పాత్రకైనా నదియానే అడుగుతున్నారు . ఓ స్టార్ హీరోయిన్ కు ఉన్న బిజీ ఇప్పుడు నదియాకు ఉందంటే నమ్మశక్యం కాదు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నా.. నదియా ఇప్పటికీ హీరోయిన్ గానే కనిపిస్తున్నారు. ఆమె పర్సనాలిటీలో ఏమాత్రం మార్పు రాకుండా జాగ్రత్తలు పడింది. దీంతో ఆమె ఏ పాత్రలోనైనా ఇమిడిపోతుంది.

నదియా ఇద్దరు కూతుళ్లు. వీరు ఫారిన్ లో చదువుకుంటున్నారు. సాధారణంగా చాలా మంది నటులు తమ వారసులను సినీ రంగంలోకి తీసుకొస్తున్నారు. కానీ నదియా మాత్రం తన కూతుళ్లను ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు. అయితే వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టింది నదియా. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అందానికి అసూయ పుట్టేలా ఉన్న నదియా కూతుళ్లను చూసి నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Comment