హీరోయిన్ గౌతమి కూతురును చూశారా..? ఎంత అందం!

ఒకప్పుడు సినిమాల్లో అందచందాలను ఆకట్టుకున్న భామలు ఇప్పుడు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమ కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే వీరిలో కొందరు రాణించగా..మరికొందరు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ పుత్రిక సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆమె ఎవరో కాదు. అందాల సుందరి గౌతమి. సౌత్ సినీ ఇండస్ట్రీలో గౌతమి గురించి తెలియని వారుండరు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఆమెకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. ఆమె జీవితంలో ఇద్దరు వ్యక్తులో కలిసుండి ప్రస్తుతం తన కూతురుతో గడుపుతోంది. అయితే కూతురు ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

హీరోయిన్ గౌతమి తెలుగుతో పాటు తమిళంలో అగ్రహీరోలందరితో నటించి మెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. సినిమాల్లో కొనసాగుతుండగానే.. 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ సంవత్సరం తరువాత వీరు విడిపోయారు. వీరిద్దరికి ఓ కూతురు జన్మించింది. ఆమె పేరు సుబ్బలక్ష్మి. సందీప్ భాటియాతో విడిపోయిన తరువాత గౌతమి ప్రముఖ నటుడు కమలాసన్ తో 20 ఏళ్ల పాటు సహజీవనం చేసింది. ఆ తరువాత వీరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

అయితే ప్రస్తుతం గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మితోనే కలిసి ఉంటోంది. సుబ్బలక్ష్మితో గౌతమి దిగిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. హీరోయిన్ గా ఏమాత్రం తీసిపోకుండా అందంగా ఉంది. హాట్ హాట్ డ్రెస్సులతో సుబ్బలక్ష్మి ఫొటోలు కొంత మంది వైరల్ చేస్తున్నారు. దీంతో ఆమె త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. అయతే ఈ విషయంపై మాత్రం గౌతమి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే హీరోయిన్ సక్సెస్ అయినా రియల్ లైఫ్లో చాలా కష్టాలు పడ్డానని గతంలో చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె కూతరును ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉందా..? అని అనుకుంటున్నారు.

మరోవైపు ఆమె పొలిటికల్ గా టచ్ లో ఉంది. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసింది. దీంతో ఆమె బీజేపీలోకి వెళ్తుందని ప్రచారం జరిగింది. కానీ ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. పలు సమాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఆమె కూతురు సుబ్బలక్ష్మి ఫొటోలో సోషల్ మీడియాలోకి రావడంతో త్వరలోనే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని అంటున్నారు.

Leave a Comment