చిన్నవయసులో ఆమె పెళ్లికి హాజరైన హీరో.. ఇప్పుడు ఆమెతోనే డేటింగ్..!

సినిమా ఇండస్ట్రీలో పెళ్లికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రేమ పెళ్లిళ్లు మొదలు..భారీ వయసు తేడాతో పెళ్లిళ్లు చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి వయసుతో పని లేదని… మనసులు కలిస్తే చాలని లివింగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేసేవారు అంటుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ భామ కూడా అదే అంటోంది. ఇటీవల ఆమె యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సాధారణ ప్రేమ అయితే ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆమెకు పెళ్లయిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిని కాదని యంగ్ హీరోతో కలిసి ఉండడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.ఆ ఫొటో స్టోరీ గురించి తెలుసుకుందాం..

బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా గురించి తెలియని వారుండరు. దబాంగ్ సినిమాలో ఆమె వేసిన స్టెప్పులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో కదలాడుతూ ఉంటాయి. అంతకుముందే హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఆమె ఈ సినిమాలోని మున్నీ సాంగ్ తో పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది. ఆ తరువాత ఆమెను అనుసరించి తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో సాంగ్ ను కూడా చేశారు. అయితే మలైకా అరోరా సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే గత నాలుగు సంవత్సరాలుగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల మధ్య ప్రేమాయణం సాగుతోందని రోజుకో వార్త వినిపిస్తోంది. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే 20 ఏళ్ల పాటు కాపురం సాగించిన భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చేసిందని చర్చించుకుంటున్నారు. ఏజ్ బార్ అయినా మలైకా అరోరా ఇప్పటికీ హాట్ బికినీ షో చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో అర్జున్ కపూర్ ఆమెతో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ఓ ఫొటో సర్కిల్ అవుతోంది. మలైకా అరోరా పెళ్లి సమయంలో ఓ బుడ్డోడు కూల్ డ్రింక్ తాగుతున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆ బుడ్డోడు ఎవరో కాదు.. అర్జున్ కపూర్. అంటే మలైకా అరోరా పెళ్లికి వచ్చిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఆమెతో డేటింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు… అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వరద కురిపిస్తున్నారు. అయితే ఈ న్యూస్ పై మలైకా, అర్జున్ ఏ విధంగా స్పందించలేదు. కానీ వారి ప్రేమాయణంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

Leave a Comment