బిచ్చగాడు హీరోను ఇంటర్వ్యూ చేసి.. పెళ్లి చేసుకున్న యాంకర్ ఎవరో తెలుసా..?

అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. అందుకే ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలను ఆదరించారు. ఇదే కోవలో మదర్ సెంటిమెంట్ తో వచ్చిన తమిళ సినిమా అయిన ‘బిచ్చగాడు’ మూవీని తెలుగుప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. కథ తో పాటు మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో విజయ్ అంటోని హీరోగా నటించి గుర్తింపు పొందాడు. అంతకుముందే తమిళ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఆయన ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అప్పటి నుంచి విజయ్ నటించిన ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ తరుణంలో విజయ్ ఆంటోనిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ యాంకర్ అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరో చూద్దాం..

విజయ్ అంటోనీ సినిమాల్లో లాగే రియల్ లైఫ్ లోనూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆయన ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. దీంతో ఆయనతో పాటు తన సోదరిని తల్లి ఎన్నో కష్టాలు పడి పెంచింది. ఒకసారి విజయ్ తల్లి ఉద్యోగ శిక్షణ నిమిత్తం ఇతర ప్రదేశానికి వెళ్లినప్పడు ఆయనను హాస్టల్ లో ఉంచి వెళ్లింది. ఈ సమయంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. అరటిపండు తిని రోజును గుడుపుకున్న పరిస్థితులను ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపాడు. ఎలాగోగా పై చదువులు చదువుకున్న విజయ్ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చాడు.

ఈతరుణంలో తనను ఇంటర్వ్యూ చేయడానికి ఫాతిమా అనే అమ్మాయి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. ఆ తరువాత విజయ్ ప్రపోజ్ చేయగా పాతిమా ఒప్పేసుకుంది. దీంతో వీరు వెంటనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి లారా అనే పాప కూడా ఉంది. విజయ్ 2012లో నాన్ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సలీమ్ అనే సినిమా చేశాడు. అయితే బిచ్చగాడు సినిమాతో ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత విజయ్ నటించిన సలీమ్ కూడా తెలుగులో రిలీజ్ అయి సక్సెస్ సాధించింది.

ఆ తరువాత విజయ్ నటించిన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. తెలుగు హీరోల్లో ఒకరిగా విజయ్ కి ఇక్కడ అభిమానులు బాగానే పెరిగారు. బిచ్చగాడు సినిమా సమయంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి రచ్చ చేశారు. అయితే ఆ తరువాత ఆయన సినిమాలు తగ్గాయి.

Leave a Comment