చెన్నకేశవరెడ్డిని వదులుకున్న స్టార్ నటీమణులు వీళ్లే..

ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు ఆదరణ ఉన్న రోజులవి. అప్పటికే ‘ఆది’ సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న వివివినాయక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో మాస్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే బాలకృష్ణ ను కలిసి స్టోరీ చెప్పడంతో వెంటనే ఓకే చెప్పారు. దీంతో ఆలస్యం కాకుండా ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాకు ముహూర్తం కుదిరింది. బాలకృష్ణ ను ద్విపాత్రాభినయంలో చూపించాలనుకుని ఇద్దరు స్టార్ హీరోయిన్లను సెలెక్ట్ చేశారు. ఇందులో తండ్రి పాత్రలో ఉన్న బాలకృష్ణకు జోడిగా టబు నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలకృష్ణకు సోదరిగా తమిళ హీరోయిన్ దేవయాని నటించింది. అయితే వీళ్ల ప్లేసులో మరో స్టార్ హీరోయిన్లు అడిగారట వివి వినాయక్. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. పైగా ఏమన్నారంటే..?

రాయలసీమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా బాలకృష్ణ నటించారు. దీంతో బాలకృష్ణకు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. సమరసింహారెడ్డి నుంచి బాలకృష్ణ చేసిన సినిమాలు దాదాపు సక్సెస్ సాధించాయి. ఇదే తరుణంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో చెన్నకేశవరెడ్డి సినిమాను చేశారు. బెల్లంకొండ సురేశ్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. పరిచూరి బ్రదర్స్ మాటలు అందించారు. ఇక వివి వినాయక్ ఆది సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన తరువాత తీసిన సినిమా ఇది.

అయితే ఇందులో తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణకు జోడిగా టబు నటించిన విషయం తెలుసు. కానీ అంతకుముందు వివివినాయ్ ఓ స్టార్ హీరోయిన్ ను కలిశారట. ఆమె ఎవరో కాదు అందాల నటి సౌందర్య. అయితే అప్పటికే స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతున్న సౌందర్యను తండ్రి బాలకృష్ణ పక్కన నటించాలని వివివినాయక్ అడిగాడట. అందుకే సౌందర్య అలా తల్లి పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదు. హీరోయిన్ గా కొనసాగుతున్న తాను తల్లి పాత్రలో నటిస్తే ఇమేజ్ దెబ్బ తింటుందని నో చెప్పిందట. వెంటనే టబును వివినాయక్ టబును సంప్రదించారట.

ఇక బాలకృష్ణకు చెల్లెలుగా దేవయాని నటించిన విషయం తెలిసిందే. అయితే ఈమె ప్లేసులో నటి లయను అడిగారట. ఇలా అడగ్గానే లయ కన్నీళ్లు పెట్టుకుందట. తెలుగు హీరోయిన్లు అంటే అంత చులకనా..? అని అందట. తాము హీరోయిన్లుగా పనికిరామా..? అని అనడంతో వివివినాయక్ లయకు సారీ చెప్పాడట. వెంటనే తమిళ హీరోయిన్ దేవయానిని సంప్రదించడా ఓకే చెప్పిందట.

 

Leave a Comment