డబ్బు ఆఫర్ వచ్చినా సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న స్టార్లు వీరే..

ఒకప్పుడు పెద్దలు నిశ్చయించిన పెళ్లిని వద్దనకుండా చేసుకునేవాళ్లు. కానీ కాలంతో పాటు మనుషులు కూడా మారారు. ఇప్పుడు పెద్దలను కాదని ఎంతో మంది సొంత నిర్ణయంతో వివాహం చేసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో ఇలాంటివి ఎక్కువ. కొందరు సినీ హీరో, హీరోయిన్లు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే మరికొందరు మాత్రం పెద్దలను ఒప్పించి ఇచ్చి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ నాటి నుంచి నేటి వరకు కొందరు స్టార్ హీరోలు సొంత మరదళ్లనే ప్రేమించి వారిని పెళ్లి చేసుకున్నారు. అలాంటి స్టార్ల గురించి తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఇమేజ్ స్పెషల్. ప్రతీ సందర్భంలో ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా ఆయనపై ప్రశంసలే కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన మొదటి భార్య బసవతారకం.. ఎన్టీఆర్ కు సొంత మరదలే అవుతుంది. పెద్దలు నిశ్చయించిన ప్రకారం ఆయన కాదనకుండా సొంత మరదలను పెళ్లి చేసుకున్నారు.

ఎన్టీఆర్ తో పోటీ పడి సినీ ఇండస్ట్రీలో కొనసాగిన అక్కినేని నాగేశ్వర్ రావుది కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే. అక్కినేని కాలంలో కూడా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నా.. ఆయన మాత్రం తన సొంత మరదలు అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం ఆమెతోనే కలిసి మెలిసి ఉన్నారు.

అలనాటి మరో స్టార్ సూపర్ స్టార్ కృష్ణ కూడా సొంత మరదలునే పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు ఇందిరా దేవి. ఈమె మహేశ్ బాబు తల్లి అన్న విషయం తెలిసిందే. ఇక మోహన్ బాబు సైతం సొంత మరదలు నిర్మలా దేవిని వివాహమాడారు.

ఆనాటి కాలం విషయాన్ని పక్కనబెడితే.. ఈరోజుల్లో లవ్ మ్యారేజ్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలోనూ కొందరు హీరోలు సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్నవారున్నారు. వారిలో సాయికుమార్ కొడుకు ఆది తన సొంత మరదలను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు.

తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా సొంత మరదలునే పెళ్లి చేసుకున్నారు. మరో హీరో శివ కార్తీకేయ కూడా ప్రేమ పెళ్లి వద్దనుకొని సొంత మరదలును వివాహమాడారు. ఇలా చాలా మంది స్టార్ నటులు కట్నానికి ఆశపడకుండా సొంత మరదళ్లను పెళ్లి చేసుకుని ప్రత్యేకంగా నిలిచారు.

Leave a Comment