ఇద్దరు స్టార్ హీరోలు ఒకే టైటిల్ తో చేసిన సినిమాలు ఏవో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. నటనలో ప్రత్యేకత చాటుకున్న ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన వారసత్వంగా వచ్చిన మహేశ్ బాబు కూడా కృష్ణను ఫాలో అవుతూ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలు చిత్రీకరించారు కృష్ణ. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా కృష్ణ చాలా సినిమాలు చేశారు. వీటిలో కొన్ని బంపర్ హిట్టు కొట్టగా మరికొన్నియావరేజ్ లో సక్సెస్ సాధించాయి. కృష్ణ నటించిన ఓ సినిమా పేరును మరో హీరో వాడుకొని కాస్త చేంజ్ చేశాడు. అయితే ఈ రెండింటిలో ఏ సినిమా సక్సెస్ అయిందో చూద్దాం.

ప్రతీ సినిమాకు టైటిల్ చాలా ముఖ్యం. సినిమా ప్రారంభంలోనే కొందరు టైటిల్ ను రిజస్ట్రేషన్ చేసుకుంటారు. మరికొందరు సినిమా పూర్తి చేసేవరకు బయటపెట్టరు. టైటిల్ బాగుంటూ సినిమా జనాల్లోకి బాగా పోతుంది. ఒకప్పుడు ప్రచార మాధ్యమానికి టైటిల్ నే ప్రమాణికంగా భావించేవారు. అయితే ఒక సినిమా టైటిల్ ను మరో సినిమా వాళ్లు వాడుకోకుండా రూల్స్ ఉంటాయి. ఇలా నిబంధనలు అతిక్రమిస్తే ఫిలిం చాంబర్లో కేసు వేస్తారు. అందుకే టైటిల్ మ్యాచ్ కాకుండా జాగ్రత్తపడుతారు.

కానీ ఒకే టైటిల్ పేరుతో ఇద్దరు స్టార్ హీరోలు సినిమా తీశారు. ఆ ఇద్దరిలో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ. 1986 కాలంలో బాపయ్య దర్శకత్వంలో ‘జయం మనదే’ అనే సినిమా తీశారు. అప్పటికే కృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఒక్క సంవత్సరంలోనే 116 రిలీజ్ కాగా అందులో కృష్ణ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే జయం మనదే అనే సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. కానీ కథ పరంగా మంచి మార్కులు పడ్డాయి.

ఇక ఇదే పేరుతో విక్టరీ వెంకటేశ్ ‘జయం మనదేరా’ అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ఎన్.శంకర్ తీసిన ఈ సినిమాలో వెంకటేశ్ ద్విపాత్రాభినయం. యంగ్ వెంకటేశ్ కు సౌందర్య హీరోయిన్ కాగా.. తండ్రి పాత్రలో నటించిన వెంకటేశ్ కు భానుప్రియ జోడిగా నటించింది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ తో సాగిన ఈ సినిమా వెంకీ సొంత బ్యానర్లో వచ్చింది. ఇలా సూపర్ స్టార్ కృష్ణ, వెంకటేశ్ లు కలిసి ఒకే పేరుతో రెండు సినిమాలు తీశారు.

Leave a Comment