ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవికి డూప్ గా చేసిన వ్యక్తలు వీరే..

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశారు. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలను ఎక్కువగా తీసేందుకు ఇంట్రెస్ట్ చూపేవారు. డైరెక్టర్లు సైతం చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని కథలను తయారు చేసేవారు. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మూడు పాత్రల్లో గొంతులు మార్చి మాట్లాడడం పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ముగ్గురు చిరంజీవిలు ఒకేసారి కనిపించినప్పడు ఇద్దరు డూప్ ల అవసరం ఏర్పడింది. ఆ డూప్ లు ఎవరు నటించారో చూద్దాం..

ఈ సినిమాలో ఒకరు పృథ్వీగా..మరొకరు పోలీస్ పాత్రలో..ఇంకొకరు దత్తాత్రేయ పాత్రలో కనిపించాలి. అయితే కొన్ని సీన్లలో చిరంజీవినే మూడు విధాలుగా నటించేవారు. అంతేకాకుండా పృథ్వీ పాత్రకు రోజా, పోలీస్ పాత్రలో ఉన్న చిరంజీవికి జోడిగా నగ్మా, దత్తాత్రేయ పాత్రకు రమ్యకృష్ణలు కలిసి నటించారు. ఇలా మూడు పాత్రలో ఆకట్టుకున్న చిరంజీవి ఓ వైపు యాక్షన్ సీన్స్ లో నటించడమే కాకుండా మరోవైపు కామెడీగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

ఇక ఒకేసారి ముగ్గురు కనిపించే సందర్భాలున్నప్పుడు మరోఇద్దరు డూప్ ల అవసరం ఏర్పడింది. ఈ ముగ్గురిలో ఒకరు పృథ్వీ పాత్రలో నటుడు ప్రసాదరావు, పోలీస్ పాత్రలో చిరంజీవి పీఏ ప్రసాద్ రావు లు నటించారు. అంటే దత్తాత్రేయ పాత్రలో ఉన్న వ్యక్తి అసలు చిరంజీవి అన్నమాట. ఇలా మూడు పాత్రల్లో చిరంజీవి మేనేజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ముగ్గురు మొనగాళ్లు సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. అటు ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అందుకే ఆ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తూ ఉంటుంది.

ఆ తరువాత కూడా మెగాస్టార్ ఎన్నో పాత్రల్లో నటించారు. కానీ ముగ్గురు మొనగాళ్లు తరువాత త్రిపాత్రాభినయం చేయలేదు. అలాంటి కథలు కూడా ఎవరూ రూపొందించలేదు. అందుకే మెగాస్టార్ సినీ కెరీర్లో ఈ సినిమా రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక ఒక చిరంజీవిని చూస్తేనే ఫ్యాన్స్ ఎంజాయ్ చేసిన ఆరోజుల్లో త్రిపాత్రాభినయంలో మెగాస్టార్ ను చూసి ఫిదా అయ్యారు. అందుకే ఆ సినిమా టీవీల్లో వస్తే చూస్తున్నారు.

Leave a Comment