బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లకి ఫిక్స్..? కృష్ణం రాజు కోరిక తీరబోతుందా..?

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ రేంజ్ కు పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఓన్లీ పాన్ ఇండియా మూవీస్ నే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు కూడా వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ప్రభాస్ లెటేస్ట్ మూవీ ‘ఆది పురుష్’. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కృష్ణం రాజు ఇటీవల మృతి చెందారు. మరికొన్ని రోజుల్లో రీ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ షిప్ కొనసాగుతుందని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

ఆదిపురుష్ షూటింగ్ లో ప్రభాస్ ను కలుసుకున్న కృతి సనన్ తన మనసు పారేసుకున్నట్లు సమాచారం. షూటింగ్ సమయంలోనే కాకుండా మాములు సమయాల్లోనూ వీరిద్దు కలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ ఇంటిని కృతి సనన్ నేరుగా వచ్చిందట. దీంతో ప్రభాస్, కృతి సనన్ ల మధ్య ఏదో జరుగుతుందని చర్చించుకుంటున్నారు. అయతే కొన్నాళ్లుగా ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయనకు జోడి దొరికిందా..? అని అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా గతంలో ప్రభాస్, అనుష్కలు మాత్రమే పెళ్లి చేసుకుంటారని వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా వారికి సంబంధించి పెళ్లి ఫొటోలు పెట్టి హల్ చల్ చేశారు. ఈ వార్తలపై ఇద్దరూ ఖండించారు. కానీ ఎవరూ పెళ్లి చేసుకోలేదు. దీంతో ఫ్యూచర్లో నైనా వీరిద్దరు ఒక్కటవుతారని భావించారు. అయితే ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు మరణించిన నేపథ్యంలో పెళ్లిపై ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారని అందరూ భావించారు.

ఈ క్రమంలో ఆయనకు, కృతి సనన్ మధ్య రిలేషన్ నడుస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ గానీ, కృతి సనన్ గానీ ఈ న్యూస్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ బాధలో ఉన్నందున కాస్త సమయం చూసుకొని స్పందిస్తారని అంటున్నారు. అయితే ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది అమ్మాయిలు, నటీమణులు ఆరాటపడ్డారు. కానీ ఆయనను కృతి సనన్ దక్కించుకోబోతుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Leave a Comment