కుట్రిపూరితంగానే #RRR కు ఆస్కార్ చాన్స్ ఇవ్వలేదా..?

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన తీసే సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కొన్ని దేశాల్లోనివారు ఎదురుచూస్తుంటారు. ఈ లెవల్లో ప్రేక్షకాదరణ ఉంది కాబట్టే జక్కన్న ప్రతీ సినిమాను చాలా జాగ్రత్తగా తీస్తాడు. అంతేకాకుండా ఆ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ కు కూడా బాధ్యులవుతాడు. అందుకే ఆయనతో సినిమా తీయడానికి కొన్ని నిర్మాణ సంస్థలు క్యూ కడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రాజమౌళి రీసెంట్ గా తీసిన #RRR సినిమా గురించి ఇప్పటికీ ఎవరూ మరిచిపోరు. ఇటీవల #RRR సినిమాకు ఆస్కార్ వస్తుందని ప్రచారం జోరుగా సాగింది. కానీ అధికారికంగా ఇండియా నుంచి ఈ సినిమా ప్రపోజల్ లేదనే విషయం క్లారిటీ రావడం ఇరు స్టార్ల అభిమానులను కలిచి వేసింది. దీంతో #RRR ఎంపిక చేయకపోవడం కుట్రేనని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టుల పెడుతున్నారు.

#RRR సినిమాను తెలుగులోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఒకే తేదీన రిలీజ్ చేశారు. సినిమాలో మంచి మెసేజ్ ఉండడంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. దేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లోని కొందరు ప్రముఖ డైరెక్లర్లు సైతం #RRR పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ‘వెరైటీ’ అనే మ్యాగజైన్ సినిమా గురించి ప్రత్యేక కథనం రాసింది. ఈ సినిమా తీసిన డైరెక్టర్ రాజమౌళితో పాటు ఇందులో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు ఇతర నటులపై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా తప్పకుండా ఆస్కార్ బరిలో నిలుస్తుందని కూడా తెలిపింది.

అప్పటి నుంచి సినిమా లెవల్ మరింత పెరిగింది. ‘వెరైటీ’ మ్యాగజైన్ పొగడడంపై ఇరు స్టార్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తమ స్టార్ కంటే తమ స్టార్ కు ఆస్కార్ వస్తుందని సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. అంతేకాకుండా ఆస్కార్ తీసుకోబోతున్నట్లుగా కొందరు ఫొటోలు మార్చి సందడి చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలోకి వెళ్లడం గర్వకారణమని కొందరు అన్నారు.

అయితే ఒక్కసారిగా అంచనాలు తలకిందులయ్యాయి. ఆస్కార్ బరిలో ఇండియా నుంచి #RRR ప్రపోజల్ లేదని తెలపడం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా ప్లేసులో గుజరాత్ కు చెందిన ‘లాస్ట్ ఫొలి షో’ సినిమా వెళ్తుందని తెలియడంతో అనేక విమర్శలు వస్తున్నాయి. వరల్డ్ లెవల్లో ఈ సినిమాకు ప్రశంసలు వచ్చిన తరుణంలో ఇంకా రిలీజ్ కూడా కానీ సినిమాను పంపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి

Leave a Comment