హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై Jr NTR దిమ్మదిరిగే రిప్లై..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో దూమారం రేగుతోంది. ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉండగా.. ఇటీవల వైఎస్సార్ పేరు మార్చుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు ఎంతో గౌరవం ఉందని, అంతేకాకుండా ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తుగా పేరు పెడితే.. దానిని వైసీపీ ప్రభుత్వం తొలగించడం హేయమైన చర్య అని ఖండిస్తున్నారు. అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా పేరు మార్చడంపై అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ట్విట్టర్ ద్వారా ఓ మెసేజ్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎన్టీఆర్ ఏం మెసేజ్ పెట్టాడంటే..?

సినిమాల్లో బిజీగా మారిన జూనియర్ ఎన్టీఆర్ తమ ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆయన స్పందనను ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఫ్యాన్స్, సినీ వర్గాల్లో ఆసక్తి చర్చ సాగుతోంది. రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటినుంచో అభిమానులు పదే పదే కోరుతున్నారు. కానీ ఆ విషయంపై ఏమాత్రం మాట్లాడని ఆయన, ఎన్టీఆర్ కు సంబంధించిన విషయంలో మాత్రం ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా అదే స్పీడుతో రియాక్ట్ కావడం సంచలనంగా మారింది.

‘NTR, YSRలు ఇద్దరరూ గొప్ప నాయకులే. కొన్ని సంస్థలకు ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం వల్ల ఎవరికి గౌరవం పోదు.. కొత్తగా రాదు.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల ఆయన స్థాయి ఏమాత్రం తగ్గదు. NTR సంపాదించుకున్న కీర్తి ఎవరో ఒకరి ద్వారా తగ్గిపోదు. ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లోనే ఉంటారు. తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది..’ Jr Ntr అనే ట్వీట్ ద్వారా మెసేజ్ పెట్టాడు.

అటు పేరు మార్పుపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ సాగుతుండగా ఎన్టీఆర్ ఎవరినీ నొప్పించకుండా మెసేజ్ పెట్టడం సంచలనంగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ మెసేజ్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు హుందాగా మెసేజ్ పెట్టావన్నా.. అంటు రిప్లై ఇస్తున్నారు. ఏదీ ఏమైనా ఎన్టీఆర్ పెట్టిన మెసేజ్ తో ఇరు పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాతగారిపై ఉన్న అభిమానంతోనే ఆయనపై వస్తున్న కన్ఫ్యూజన్ ను తొలగించడానికి ఎన్టీఆర్ ఇలా స్పందించాడని అంటున్నారు.

Leave a Comment