సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా ఉన్నవాళ్లేవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు.. కానీ కొందరు సినిమానే జీవితం అనుకొని ఇక్కడే గడుపుతున్నారు. కొన్ని రోజులు జీవితం బాగుండి.. ఆ తరువాత సాధారణ జీవితం ఉన్నా.. ఈ పరిశ్రమతోనే అనుబంధం పెంచుకున్నారు. నటుడిగా, టెక్నీషియన్ గా.. ఏదో ఒక రంగంలో ఉంటూ పరిశ్రమలో కొనసాగుతున్నారు. వీరిలో కొందరు సక్సెస్ జీవితం గడిపి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా..మరికొందరు మాత్రం మళ్లీ అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం..

కె.విశ్వనాథ్

స్వయంకృషి, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శంకరాభరణం లాంటి ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కె.విశ్వనాథ్ ప్రముఖ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలో ఎందరో స్టార్ హీరోలు నటించారు. అయితే వయసు రీత్యా ఆయన డైరెక్టర్ బాధ్యతల నుంచి నటుడిగా మారాడు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. ప్రభాస్ నటించిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్ ’ సినిమా తరువాత కె. విశ్వనాథ్ మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా ఆయనకు 74 ఏళ్లు.

కైకాల సత్యనారాయణ

నాటి ఎన్టీఆర్ నుంచి నేటి మహేశ్ బాబు వరకు సినిమల్లో కొనసాగిన కైకాల సత్యనారాయణ హీరోగా తప్ప అన్ని పాత్రల్లో కనిపించారు. నాటి ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా కైకాల మాత్రమే ఉండేవారు. కాల క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా మహర్షి సినిమాలో కనిపించిన ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించినట్లుంది. ఆయన వయసు ప్రస్తుతం 87 ఏళ్లు.

వాణిశ్రీ

అలనాటి మేటి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వాణిశ్రీ లేని సినిమా లేదు. కొంతకాలంగా సక్సెస్ సినిమాల్లో నటించి ఆ తరువాత తప్పుకున్నారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

జమున

హీరోయిన్ అయినా చలాకీ అమ్మాయిగా కనిపిస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు జమున. కృష్ణ, తదితర సీనియర్ నటులతో కలిసి నటించిన జమున ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు.

సరోజా దేవి

1990 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న ఈమె భర్త దూరం కావడంతో వెండితెర నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె వయసు 85 సంవత్సరాలు..

గిరిబాబు

విలన్ గా వెండితెరకు పరిచయం అయిన గిరిబాబు మొన్నటి వరకు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 83లో ఉన్నారు.

కె.రాఘవేంద్రరావు
డైరెక్టర్ గా ఎన్నో సక్సెస్ సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఇప్పటికీ యాక్టివ్ గా ఉండడం విశేషం. మనువడి వయసులో ఉన్నవారితో సినిమాలు తీసిన ఆక్ష్న వయసు 81.

చలపతిరావు
నాటి నుంచి నేటి వరకు ఇప్పటికీ కొన్ని సినిమాల్లో కనిపిస్తున్న చలపతిరావు వయసు 88.

అన్నపూర్ణ
సీనియర్ యాక్టర్ అన్నపూర్ణకు ప్రస్తుతం 74 సంవత్సరాలు.

రామోజీరావు
నిర్మాతగా ఎన్నో సినిమాలు తీసిన ఆయన ఈ టీవిని స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఏదైనా ఫంక్షన్లకుమాత్రమే అటెండ్ అవుతూ ఉంటారు.

కోటశ్రీనివాసరావు
అలనాటి హీరోలతో పాటు మొన్నటి వరకు సినిమాల్లో కనిపించిన కోట శ్రీనివాసరావు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.

Leave a Comment