వెంకటేశ్, సౌందర్య కాంబోలో ఎన్ని సినిమాలు హిట్టుకొట్టాయో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. కొందరు డైరెక్టర్లు వీరి కాంబినేషన్ల ఆధారంగా సినిమాలకు కథలను కూడా రాశారు. అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటి మెగాస్టార్ వరకు ఒకే హీరోయిన్ తో రెండు సినిమాలు చేసినవి చాలా ఉన్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ద బెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సౌందర్య కుర్ర హీరోల నుంచి అగ్రహీరోలందరితో సినిమాలు చేసింది. ఒకే హీరోతో రెండేసి సినిమాల్లో నటించింది. మిగతా వారికంటే వెంకటేశ్ తో చాలా సినిమాల్లో కనిపించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఒక్కటి తప్ప మిగతావన్నీ హిట్టు కొట్టాయి. ఆ సినిమాలేవో చూద్దాం..

పవిత్రబంధం

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన పవిత్ర బంధం సినిమా సూపర్ డూపర్ హిట్టయింది.భర్తకు భార్య సేవ చేసే హహిళగా సౌందర్య ఈ సినిమాలో ఎంతో ఓర్పుగా నటించింది. వెంకటేశ్ తో పోటీగా సౌందర్య నటించడంతో పాటు అమెకు ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

జయంమనదేరా

వెంకటేశ్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. యంగ్ హీరోయిన్ గా కనిపించిన సౌందర్యకు ఈ సినిమాలో నటనకు మంచి మార్కలే పడ్డాయి. ఈ సినిమా విజయం సాధించింది.

పెళ్లి చేసుకుందాం..

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటర్ గా వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకటేశ్, సౌందర్య జోడి అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ లు కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్టు కొట్టింది.

ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు

వెంకటేశ్, సౌందర్య కాంబినేసన్లో చాలా సినిమాలో ఫ్యామిలీ సినిమాలే వచ్చాయి. ఇందులో ఈ సినిమా ఒకటి. ఈ సినిమాలో సౌందర్యతో పాటు వినీత కూడా నటించారు. కానీ సౌందర్య మెయిన్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించింది.

రాజా

సెంటిమెంట్ యాక్షన్ సినిమాగా వచ్చిన రాజా బంపర్ హిట్టుకొట్టింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తూ అలరిస్తూ ఉంటుంది. వెంకటేశ్, సౌందర్యలు కలిసి ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలు పోషించారు.

దేవిపుత్రుడు

ఇందులో కూడా వెంకటేశ్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒక పాత్రకు సౌందర్య హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు.

Leave a Comment