రమ్యకృష్ణ జీవితాన్ని నిలబెట్టిన 10 సినిమాలు ఇవే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో రమ్యకృష్ణ గురించి తెలియని వారుండరు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సీనియర్ నటి ఇప్పటికీ సినిమాలో నటిస్తుండడం విశేషం. హీరోయిన్ గా, దేవతగా, పోలీస్ గా.. గడగడలాడించే శివగామిగా.. చివరికి విలన్ గా ఇలా ఏ పాత్ర అయినా సరే రమ్యకృష్ణ అందులో ఇమిడిపోతుంది. సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. రమ్యకృష్ణ నటనలో ఏమాత్రం లోటు ఉండదనే చెప్పొచ్చు. రమ్యకృష్ణ సినీ కెరీర్లో వందల సినిమాల్లో నటించింది. కానీ ఆమె జీవితాన్ని ఓ 10 సినిమాలు కెరీర్ మలుపు తిప్పాయి. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం…

1. బాహుబలి

ఈ సినిమాలో శివగామి పాత్రలో నటించింది రమ్యకృష్ణ. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ దాదాపు హీరోతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరో నటిని ఊహించుకోలేమని చాలా మంది ప్రశంసలు కురిపించారు.

2. నరసింహా

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ రెండు పాత్రల్లో చూడొచ్చు. సినిమా ఎంట్రీలో ఈమె హీరోయిన్ గా అలరించి ఆ తరువాత విలన్ అవతారమెత్తుతారు. హీరోయిన్లు కూడా విలన్ గా నటించొచ్చు అని రమ్యకృష్ణ మాత్రమే నిరూపించారు.

3. అమ్మోరు

ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడానికి దాదాపు చాలా మంది ఒప్పుకోరు. కానీ రమ్యకృష్ణ మాత్రం ఏ పాత్ర చేయడానికైనా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘అమ్మోరు’ సినిమాలో రమ్యకృష్ణ దేవత పాత్ర పోషించారు.ఒక గ్రామ దేవత ఇలాగే ఉంటుంది అన్న విధంగా ఇందులో నటించారు.

4. సూత్రధారులు

1980లో వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా చేశారు. కె. విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

5. అల్లరిమొగుడు

ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమాలకు ఆ కాలంలో మంచి డిమాండ్ ఉండేది. ఈ క్రమంలో కొందరు డైరెక్టర్లు అలాంటి సినిమాలను ఎక్కువగా తీసేవారు. ఈ సినిమాల్లో రమ్యకృష్ణకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారు. ఈ క్రమంలో నాగార్జున హీరోగా వచ్చిన ఘరానాబుల్లోడు సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.

6. అల్లుడుగారు

కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ‘అల్లుడుగారు’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఇందులో రమ్యకృష్ణ ఒకరు. ఈ సినిమాలో నటనకు రమ్యకృష్ణకు స్పెషల్ ఇమేజ్ వచ్చింది.

అల్లుడుగారు
అల్లుడుగారు

7. సోగ్గాడి పెళ్లాం

మోహన్ బాబుతో కలిసి నటించిన రమ్యకృష్ణ ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. డిఫరెంట్ పాత్రలో నటించిన రమ్యకృష్ణ నటనకు అన్నివైపులా ప్రశంసలు దక్కాయి.

8. హలోబ్రదర్

అక్కినేని నాగార్జునతో రమ్యకృష్ణ చేసిన సినిమాల్లో ‘హలో బ్రదర్’ ఒకటి. కామెడీ, యాక్షన్ కలగలిపి వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది.

9. ఘరానా బుల్లోడు

అక్కినేని నాగార్జునతో కలిసి రమ్యకృష్ణ చేసిన మరో సినిమా ఘరానా బుల్లోడు. ఈ సినిమాలో ఆమని నటించినా.. రమ్యకృష్ణ నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

10. ఆహ్వానం

పెళ్లయిన ఓ మహిలకు ఎన్ని కష్టాలుంటాయో తెలిపే సినిమా ఆహ్వానం. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అయినా పెళ్లయిన మహిళగా రమ్యకృష్ణ చాల చక్కగా నటించారు.

Leave a Comment