జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి..? ఆ ట్వీట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఇంతకాలం సినిమాలకే పరిమితమైన ఆయన మరోసారి తెల్లచొక్కా ధరించే అవకాశం ఉందా..? అయితే ఏ పార్టీలోకి వెళ్తున్నారు..? తమ్మడు స్థాపించిన జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా..? ఇలాంటి చర్చలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా సాగుతున్నాయి. అయితే ఈ చర్చలు జరగడానికి ఓ పెద్ద కారణమే ఉంది. చిరంజీవి కొణిదెల పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో చిరంజీవి గొంతుతో ఉన్న ఓ వాయిస్ వైరల్ అవుతోంది. ఈ వాయిస్ విన్న మెగా ఫ్యాన్స్ మళ్లీ చిరు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని రచ్చ చేస్తున్నారు. ఇంతకీ చిరు రాజకీయాల్లోకి నిజంగానే వస్తున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి ఆణిముత్యమనే చెప్పుకొవచ్చు. డ్యాన్స్, కామెడీ, యాక్షన్ , సెంటిమెంట్ ఇలా ఏ కోణంలో చూసినా ఈ సుప్రీం హీరో అద్భుతంగానే కనిపిస్తాడు. అందుకే ఆయన సినిమాలు దాదాపు విజయం వరకు వెళ్తాయి. సినిమాల్లో కథ బాగా లేకున్నా చిరంజీవిని వెండితెరపై చూసినా చాలు.. అనే ఫ్యాన్ష్ చాలా మంది ఉన్నారు. పునాది రాళ్ల నుంచి మొన్నటి ఆచార్య వరకు చిరు సినీ కెరీర్లో ఎన్నో మలుపులు తిరిగాయి. అయితే మధ్యలో ఎనిమిదేళ్లు మాత్రం ఇండస్ట్రీ చిరును చూడలేకపోయింది.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన నటులు చాలా మందే ఉన్నారు. అందరూ సక్సెస్ కాలేకపోయారు. కానీ మెగాస్టార్ కున్న ప్రభంజనాన్ని దృష్టిలో పెట్టుకొని 2008 ఆగస్టు 26లో ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో పోటీ చేయగా 18 సీట్లు గెలుచుకున్నారు. అయితే అప్పటి వరకు ఏ పార్టీలోకి చేరని చిరు సొంతంగా పార్టీ పెట్టడంతో చిరు వెనక చాలా మందే వచ్చారు. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. కాలక్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యంను 2011లో కాంగ్రెస్ లో విలీనం చేశారు.

ఆ తరువాత దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ‘ఖైదీ నెంబర్ 150’ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు తీస్తున్నారు. అయితే సినిమాల్లో కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో మెగాస్టార్ మరోసంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలోకి వెళ్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ అటు చిరంజీవి గానీ.. ఇటు పవన్ గానీ.. అధికారికంగా బయటపెట్టలేదు.

తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ ఖాతలో ఓ వాయిస్ పెట్టడం సంచలనంగా మారింది. ఇందులో ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు’ అని ఉంది. దీంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రోజుల కిందట పవన్ జనసేన పార్టీకి సపోర్టుగా మాట్లాడిన ఆయన ఎప్పటికైనా జనసేనలో ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ఏపీలో మోదీ పర్యటించిన సందర్భంగా ఓ కార్యక్రమానికి మెగాస్టార్ హాజరయ్యారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అయితే ఈ వాయిస్ ఆయన నటించబోయే ‘గాఢ్ పాదర్’లోనిదని తెలుస్తోంది. సినిమాలోని వాయిస్ అయినా ప్రత్యేకంగా దీనిని చిరు తన ఖాతాలో పెట్టడంతో మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే.. అది జనసేన పార్టీలోకి వస్తే ఆట రంజుగా ఉంటుందని కొందరు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Leave a Comment