కేజీఎఫ్ లాంటి సినిమాను చిరంజీవి ఎప్పుడో చేశాడు..ఆ సినిమా ఇదే..

సినిమా ఇండస్ట్రీలో కొందరు జీవితాంతం కష్టపడినా అనుకున్న స్థాయికి చేరలేరు. కానీ కొందరు ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయి అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి వాళ్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఆయన తీసిన ఒకే ఒక్క సినిమా ‘కేజీఎఫ్’తో వన్ నైట్ స్టార్ గా మారాడు. ఎవరూ ఊహించని కథతో యశ్ ను హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా ఇండియా లెవల్లో ప్రభంజనం సృష్టించింది. కేవలం కథ, యాక్షన్ పరంగానే కాకుండా కమర్షియల్ గా సినిమా సక్సెస్ అయింది. ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో పార్ట్ 2 వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేజీఎఫ్ సినిమా కథ లాంటి సినిమాను మన మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో చేశాడు. ఆ సినిమా గురించి తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న గుర్తింపు స్పెషల్. ఆయన సినిమా కోసం వెయిట్ చేయని వారు లేరు. పురుషులతో పాటు మహిళా ప్రేక్షకులు మెగాస్టార్ ఆన్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో గతంలో చిరంజీవి సినిమాలు వరుసగా వచ్చేవి. హిట్టు, ఫట్టుతో చిరంజీవి సినిమాలు చేసేవాడు. కొన్ని సినిమాలు బంపర్ హిట్టు కొట్టగా.. మరికొన్ని యావరేజ్ అయినా మంచి సినిమాలు అనిపించుకునేవి. ఎందుకంటే చిరంజీవిని బేస్ చేసుకొని కథను తయారు చేసేవారు. ఇందులో భాగం గా కేవలం ఆయన ప్రధానంగా వచ్చిన సినిమా రాక్షసుడు.

1986లో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన రాక్షసుడు సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సినిమా. ఇందులో చిరుకు జోడిగా రాధ, సుహాసిని నటించారు. అలాగే నాగబాబు, రాజేంద్రప్రసాద్, సుమలత వంటి ముఖ్య నటులు కూడా పోషించారు. అయితే ఈ సినిమా కథ అప్పట్లో హైలెట్ గా నిలిచింది. వితంతు తల్లి ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఊరిపెద్ద దానిని ఆమోదించకపోయేసరికి ఆ బిడ్డను పారేస్తుంది. అయితే ఆ బిడ్డ ఓ తాగుబోతు చేతికి దొరకడంతో ఆ తాగుబోతు ఆ అబ్బాయిని పెంచి లేబర్ క్యాంపుకు విక్రయించాలని చూస్తాడు. కానీ అతడు తన తల్లిని వెతుక్కునేందుకు వెళ్తాడు.

అయితే అక్కడ యజమాని మీ తల్లి పారిపోయిందని, అందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కానీ ఆ తరువాత ఆ యువకుడు ఏం చేస్తాడు..? అనేది సినిమా స్టోరీ. కేజీఎప్ సీనిమాలో యశ్ పాత్రలాగే రాక్షసుడులోని చిరంజీవి పాత్ర పోలి ఉంటుంది. అయితే కథ యాజ్ టీస్ సేమ్ కాకపోయినా స్క్రీన్ ప్లే దాదాపు మ్యాచ్ అవుతుంది. దీంతో చిరంజీవి అప్పట్లోనే ఇలాంటి సినిమా చేశాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

Leave a Comment