పవన్ కల్యాణ్ బంగారం పాప ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలో నటించాలని ఎవరికైనా కోరిక ఉంటుంది. అయితే కొందరికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ఒక్కసారి పవన్ సినిమాలో కనిపిస్తే చాలు ఆ తరువాత ఇండస్ట్రీ మొత్తం పరిచయం అవుతామని కొందరు ఆశిస్తారు. ఇలా పవర్ స్టార్ సినిమాల్లో నటించిన వారంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వారు ఇప్పుడు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. పవన్ సినీ కెరీర్లో వచ్చిన మూవీ బంగారం. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోయినా ఇందులో పవన్ తో పాటు నటించినవారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో హీరోయిన్ చెల్లెలగా వింద్యారెడ్డి పాత్రలో నటించిన పాప ఇప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. ఆ విశేషాలేంటో చూద్దాం..

బంగారం సినిమాలో వింద్యారెడ్డి పాత్రలో కనిపించిన అమ్మాయి పేరు నునుష. ఈమె బంగారం సినిమాలో కంటే ముందే మలయాళ చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు 20 సినిమాల్లో నటించిన ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డు గెలుచుకుంది. అయితే తెలుగులో నటించిన తరువాత ప్రత్యేక గుర్తింపు సాధించింది. కేరళకు చెందిన ఈ పాప బంగారం సినిమా తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. కానీ హీరోయిన్ గా మాత్రం రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.

హీరోయిన్ గా మలయాళంలోనే ‘మిస్టర్ మురుగన్’ సినిమాలో మొదటిసారిగా హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత ఆమె నటనకు ఫిదా అయిన వారు తెలుగులో కూడా అవకాశం ఇచ్చారు. తెలుగులో రేణిగుంట, జీనియస్ సినిమాల్లో చేసి ఆకట్టుకుంది. నానీ హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అయితే తెలుగులో అవకాశాలు రావడంతో మళ్లీ మాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది నునుష. అక్కడ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అక్కడే సెటిలయింది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది నునుష. ఆమెకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. కరోనా సమయంలో ఆమె ఇంట్లోనే ఉండడంతో మానసిక వైద్యులను సంప్రదించింది. ఈ విషయం ఆమె షేర్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment