కృష్ణం రాజు రెండోపెళ్లి ఎందుకు చేసుకున్నారు..? మొదటి భార్య ఎవరు..?

తాండ్ర పాపారాయుడిగా తన నటనతో ఆకట్టుకున్న కృష్ణం రాజు మన మధ్య లేరన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర శోకంలోకి నెట్టింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించడం ఎంతో బాధాకరం. ఈ నేపథ్యంలో కృష్ణం రాజు గురించి గత స్మృతులు నెమరేసుకుంటున్నారు. నేటి ప్రేక్షకులకు కృష్ణం రాజు పెద్దగా తెలియకపోయినా.. రెండోతరం సినీ ప్రేక్షకుల్లో ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన రెబల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాల ద్వారా కృష్ణం రాజు పర్సనల్ విషయాలు చాలా మందికి తెలియదు. ముఖ్యగా ఆయనకు ఇద్దరు భార్యలన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ విశేషాలేంటో చూద్దాం..

కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఆయన ఎక్కువగా విలన్ పాత్రలు వేశారు. ఆ తరువాత హీరోగా మారాడు. ఇలా మొత్తం 187 సినిమాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. చివరిసారిగా ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సినిమాల్లో నటిస్తూనే కృష్ణం రాజు రాజకీయాల్లోకి వచ్చారు. వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

ఇక ఆయన పర్సనల్ విషయానికొస్తే ముందుగా ఆయన సీతాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే 1995లో రోడ్డు ప్రమాదంలో సీతాదేవి మరణించారు. ఆ తరువాతమ కృష్ణం రాజు శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు జన్మించారు. మొదటి భార్య కుమార్తెకు వివాహం కావడంతో పాటు పిల్లలు ఉన్నారు. నలుగురు కుమార్తెలే కాకుండా ఆయన మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఐదుగురు అమ్మాయిలకు తండ్రిగా వ్యవహరించారు.

Leave a Comment