ప్రతిరోజూ శృ0గారం చేస్తే గుండెకు ఏమవుతుంది..?

శృ0గారం ఆరోగ్యకరం. ఈ పదాన్ని చాలా చోట్ల చూస్తుంటాం.. వింటుంటాం.. కానీ ఎలా ఆరోగ్యంగా ఉంటుంది..? అనే విషయాలపై కొంతమందికి అవగాహన ఉండదు. శృ0గారం కేవలం ఐదు నిమిషాల ఆనందం కోసమే అని కొందరి అభిప్రాయం. కానీ వైద్య నిపుణుల ప్రకారం భార్యభర్తల మధ్య ఇష్టపూర్వకంగా జరిగే కలయికతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా డైలీ శృ0గారంతో గుండెకు మేలే జరుగుతుందని సూచిస్తున్నారు. అయితే కొన్ని ఇళ్లల్లో ప్రతీరోజూ సాధ్యం కాకపోవచ్చు. కానీ కనీసం క్రమం తప్పకుండా శృ0గారంలో పాల్గొనడం ద్వారా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు రావని బ్రిటన్ కు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలాయని అంటున్నారు. ప్రతిరోజూ శృ0గారంలో పాల్గొనడం ద్వారా ఎలాంటి వ్యాధులను అడ్డుకోవచ్చు..?

Happy young romantic couple in the city at night.

మానవ శరీరానికి గుండె ప్రధానం. ప్రతీ అవయవానికి రక్త ప్రసరణ ఇక్కడి నుంచే జరుగుతుంది. హృదయం బాగుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి గుండెను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… నేటి పొల్యూషన్ కారణంగా అనేక వ్యాధులు వస్తున్నాయి. అయితే అందుబాటులో ఉన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుండెను కాపాడుకోవచ్చని వైద్యలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సరైన ఆహారం, వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది. కానీ ఆ ఎనర్జీ మిగతా అవయవాలకు చేరాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలని అంటున్నారు. అయితే గుండెలో అప్పుడప్పుడు కొవ్వు పేరుకుపోవడంతో రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఫలితంగా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ కొవ్వు విపరీతంగా పేరుకుపోవడంతో కార్డియాట్రిక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాయామం చేయడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంంటుంది. అయితే వ్యాయామం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాయామానికి సమానమైన శృంగారంగలో పాల్గొనడం ద్వారా అంతే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం ద్వారా రక్తనాళాలు ద్వారా రక్తం పంపింగ్ అవుతుందట. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగించబడుతుందట. ప్రతిరోజూ శృంగారం చేసే వ్యక్తిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందట.

చాలా మంది రిలీప్ టూల్ గా శృ0గారాన్ని ఎంచుకుంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ఇది మంచి మార్గమని అనుకుంటారు. ఒత్తిడికి శరీరం స్పందించే క్రమంలో విడుదలయ్యే హార్మోన్లు మోతాదులు శృ0గారంతో తగ్గుతున్నట్లు బ్రిటన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో బయటపడ్డాయి. అంతే శృంగారం చేసే వ్యక్తి అరోగ్యంగా, ఆనందంగా ఉంటారని చెబుతున్నారు. శృ0గారంలో పాల్గొన్న సమయంలో నిమిషానికి 6 కేలరీల శక్తి ఖర్చవుతుంది. ఇది వేగంగా నడిచే వ్యక్తికి ఖర్చయ్యే కేలరీలతో సమానం. అలాగే తోటపని, నడక, మెట్లు నడిచిన వారితో సమానమని కూడా అంటున్నారు. ఇక ప్రతిరోజూ శృ0గారంలో పాల్గొనే వ్యక్తికి మెదడు చురుగ్గా పనిచేస్తుందని కూడా అంటున్నారు.

Leave a Comment