సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది తారలు పెళ్లయిన తరువాత కూడా కెమెరా ముందుకు వస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో.. టీవీ షోల్లోనో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం పెళ్లయిన తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు మళ్లీ చూడలేదు. కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడగా.. మరికొందరు మాత్రం ఇతర దేశాల్లో సెటిలయ్యారు. ఇక అందచందాలతో అలరించిన చాలా మంది భామలు ఇతర రంగాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు. కొందరు ఇతర దేశస్థులను వివాహం చేసుకొని అక్కడే సెటిలయ్యారు. అలాంటి వారిలో రిచా గంగోపాధ్యాయ ఒకరు. మిర్చి సినిమాతో ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఆ ఫొటోలను చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే..?

 

View this post on Instagram

 

A post shared by Richa Langella (@richalangella)

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఎంతో మంది నటులు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. కొత్తవారితో సక్సెస్ సినిమా తీయడం ఆయన శైలి. ఇలా రానాను హీరోగా పెట్టి లీడర్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇందులో రిచా గంగోపాధ్యాయ మొదటిసారిగా కనిపించి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత మిరపకాయ్ సినిమాలో రవితేజ పక్కన నటించి అలరించింది. అయితే ఆ తరువాత ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాతో మరింత ఫేమస్ సాధించింది. వెంకటేశ్ నటించిన నాగావళి సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటికీ స్టార్ హీరోయిన్ అయినా రిచా సారొచ్చారు లాంటి సినిమాల్లో నటించింది. చివరిసారిగా నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమాలో కనిపించింది రిచా.

అయితే ఆ తరువాత అమెరికాకు చెందిన జోలంగేళ్ల అనే వ్యక్తిని ప్రేమించింది రిచా. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికి ఓ పాప. పెళ్లి తరువాత ఎంతో హ్యాపీ జీవితాన్ని అనుభవిస్తున్నానని రిచా చెబుతోంది. అమెకు సంబంధించిన కొన్ని లెటేస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తన పాపతో పాటు భర్తలో ఉన్న ఫొటోలను నెట్లో పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Richa Langella (@richalangella)

రిచా గంగోపాధ్యాయ లెటేస్ట్ ఫొటోలను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే సినిమాల్లోని రిచాకు ఇప్పటి రిచా పూర్తిగా మారిపోయింది. కాస్త బొద్దుగా మారిన ఆమెను చూసి రిచా గంగోపాధ్యాయ అని ఎవరూ అనుకోరు. అయితే ఇప్పటికీ అందంగానే ఉన్న ఆమెను చూసి చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు. ఏదీ ఏమైనా సినిమాల్లో అలరించిన ఆమె ఇప్పటి ఫొటోలతో పోలుస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here