1980లో స్టార్ల రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచమే కాదు. వేల కోట్ల బడ్జెట్ టర్నోవర్ జరిగే అతిపెద్ద పరిశ్రమ. మిగతా రంగాల కంటే సినీ రంగంలో భారీ బడ్జెట్ చేతులు మారుతూ ఉంటుంది. కొన్ని సినిమాల కోసం 500 కోట్లు పెట్టి తీసిన సందర్బాలున్నాయి. ఈ క్రమంలో స్టార్ల రెమ్యూనరేషన్స్ కూడా కోట్లలో ఉన్నాయి. కొందరు హీరోలకు 20 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇదంటా ఇప్పటి విషయం. మరి పూర్వంలో కూడా ఇలాంటి బడ్జెట్ పెట్టి సినిమాలు తీశారా..? అప్పుడు స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు..? అసలేం జరిగింది..? ఆ విషయాలు మీకోసం..

1980ల కాలంలో తమిళ ఇండస్ట్రీలో మాత్రమే పెద్ద సినిమాలు తీసేవారు. కానీ మన తెలుగువాళ్లు ఏమాత్రం తీసిపోరన్నట్లుగా భారీ బడ్జెట్ సినిమాలను మొదలు పెట్టారు. ఎంతో కృషి చేసి మద్రాస్ నుంచి తెలుగు సినిమాను హైదరాబాద్ కు తీసుకొచ్చిన తరువాత ఇండస్ట్రీలో అనేక మార్పులు జరిగాయి. అంతేకాకుండా కొందరు హీరోలు సొంతంగా స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్ లు నిర్మించి మద్రాస్ తో సంబంధాలు పెట్టుకోకుండా సినిమాలు తీశారు. ఈ క్రమంలో అప్పటి వరకున్న బడ్జెట్ కాస్త పెరిగిపోయింది. అప్పటి నుంచి హై బడ్జెట్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు.

ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోగా పేరున్న ఎన్టీఆరే భారీ బడ్జెట్ సినిమాలు తీయడాన్ని ప్రారంభించారు. ఆయన హయాంలో ఒక్కో సినిమాకు 12 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఆ తరువాత ఏఎన్నార్ కూడా ఇదే బాటలో వెళ్లారు. ఏఎన్నార్ సినిమాలకు 30 నుంచి 40 లక్షల బడ్జెట్ అవసరమయ్యేది. ఇందులో 10 లక్షల వరకు ఆయనకు ఇచ్చేవారు. ఇక కృష్ణ సినిమాలు కూడా 20 నుంచి 30 లక్షల బడ్జెట్ తో సినిమాలు తీయగా అందులో 7 లక్షల వరకు ఆయనకు చెల్లించేవారు.
వీరికి తోడుగా శోభన్ బాబు కూడా పెద్ద సినిమాల్లో నటించేవారు. ఆయన సినిమాకు కనీసం 25 లక్షల బడ్జెట్ ఖర్చయ్యేది. ఇందులో 6 నుంచి 7 లక్షల వరకు ఆయనకు చెల్లించేవారు.

వీరి తరువాత వచ్చిన మూడోతరం హీరోలు వారికంటే ఎక్కువ బడ్జెట్ పెరిగింది. అప్పటికే ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాకు 17 లక్షలు ఖర్చయ్యేది. ఇందులో 3 నుంచి 4 లక్షల వరకు ఆయన రెమ్యూనరేషన్ తీసుకునే వారు. చిత్ర పరిశ్రమలో ఇదే సమయంలో సుమన్ కు బాగా ఫాలోయింగ్ పెరిగింది. సుమన్ సినిమాలకు కూడా 17 లక్షల బడ్జెట్ కేటాయించేవారు. ఇందులో ఆయనకు 3 లక్షల కేటాయించేవారు.

ఇలా బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ సినిమాలకు హై బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఆయన నటించిన బాహుబలి, సాహో సినిమాలకు 300 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇందులో ఆయనకు 50 కోట్ల వరకు చెల్లించారని సమాచారం. స్టార్ల రెమ్యూనరేషన్ తో పాటు గ్రాఫిక్స్ రేంజ్ పెంచేందుకు హై బడ్జెట్ కేటాయించాల్సి వస్తోంది. అయితే చాలా సినిమాలు బడ్జెట్ రికవరీ కాలేకపోవడంతో కొందరు చిన్న సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Leave a Comment