అప్పట్లో ఎన్టీఆర్ ఎలాంటి ఆహారం తీసుకునేవారు..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర వహించిన సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మనమధ్య లేరు. కానీ ఆయన గుర్తులు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమాను చూడని సినీ ప్రేక్షకుడు ఉండడు. అలాగే ఆయన నటనకు ఫిదా అయిన ఆయన మార్గంలో నడిచిన వారు ఎందరో ఉన్నారు. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పేద ప్రజల బాగు కోసం ఎన్నో పథకాలను ప్రశేవపెట్టాడు. ఆయన ప్రవేశపెట్టిన రూ.2 కిలో రేషన్ బియ్యం ఇప్పటికీ అమలవుతుండడం విశేషం. క్రమశిక్షణకు మారుపేరుగా పిలిచే ఎన్టీఆర్ ప్రతీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేవారు. అలాగే ఆయన ఆహరం విషయంలో కూడా క్రమ పద్దతిని మెయింటేన్ చేసేవారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎన్టీఆర్ జాడలు కనిపిస్తాయి. ఆయన నటించిన సినిమాలు టీవీల్లో ప్రసారమవుతాయి. రాముడిగా, కృష్ణుడిగా ఎటువంటి పాత్రలోనైనా అన్నగారు ఇమిడిపోతారు. అయితే నటన, క్రమశిక్షణలోనే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా ఎన్టీఆర్ పలు జాగ్రత్తలు తీసుకునేవారు. ముఖ్యగా ఆహారం విషయంలో తనకు ఇష్టమైన ఫుడ్ కచ్చితంగా తీసుకునేవారు. మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం ఉంటుందని ఎన్టీఆర్ ఎక్కువగా నమ్మేవారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా మెనూను ఏర్పాటు చేసుకొని భోజనం చేసేవారు.

సినిమాల్లో కొనసాగిన సమయంలో ఎన్టీఆర్ రోజులో రెండు భాగాలగా విభజించుకునేవారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 9 గంటల వరకు షూటింగ్ కోసం కేటాయించేవారు. ఈ క్రమంలో ఆయన ఉదయం 3 గంటలకే నిద్ర లేచేవారు. లేవగానే వ్యాయామం చేసేవారు. వ్యాయామం అయిన తరువాత ఎన్టీఆర్ 24 ఇడ్లీలు తినేవారు. ఆ కాలంలో ఇడ్లీలు మరింత పెద్దగా ఉండేవి. అలాంటి ఇడ్లీలు 24 కు తక్కువ కాకుండా తినేవారు.

ఇడ్లీలు తిన్న వెంటనే ఉదయం 9 గంటలకు భోజనం చేసేవారు. ఈ భోజనంలో కచ్చితంగా మాంసం ఉండేలా చూసుకునేవారు. ఒకవేళ ఉదయం మిస్సయినా మధ్యాహ్నం అయినా కచ్చితంగా ఉండేలా చూసుకునేవారు. అయితే అప్పుడప్పుడు బజ్జీలను తినేవారు. ఇవి కచ్చితంగా 30 నుంచి 40 వరకు తినేవారు. ఇవే కాకుండా రకరకాల ఆహారంగానే ఇష్టంగా తినేవారు. ఆహారం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తీసుకునేవారు. అందుకే ఎప్పటికీ ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉండేవారు.

Leave a Comment