జయం హీరోయిన్ చెల్లెలు అందం మాములుగా లేదుగా..

చాలా మంది సినిమాల్లో చాన్స్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ నటి మాత్రం తన వారసులను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని అస్సలు అనుకోలేదట. అయితే తన కూతురి చిన్న కోరిక మేరకు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించేందుకు అనుమతి ఇచ్చింది. అలా ఓ చైల్డ్ ఆర్టిస్టు ఒకే ఒక్క సినిమాలో నటించి ఫేమస్ అయింది. ఆ తరువాత మరో సినిమాలో నటించలేదు. ఎందుకంటే ఆమె తల్లి కూడా నటినే. సినిమాలో ఉన్న కష్టాలను చూసి తన కూతురు కూడా అలాంటి బాధలు పడోద్దనే ఉద్దేశ్యంతో తన కూతురిని సినిమా ఇండస్ట్రీలోకి పంపలేదు. అమెరికాకు పంపించి సెటిల్ చేసింది. అయితే చైల్డ్ ఆర్టిస్టుగా ఒకే ఒక్క సినిమాలో నటించిన ఆమె ఎవరు..? ప్రస్తుతం ఎలా ఉంది.

లవ్ సినిమాలను తీయడంతో తేజ దిట్ట. చిత్రం, జయం వంటి సినిమాలో అప్పట్లో యూత్ ఫాలోవర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమా గురంచి తెలియని వారుండరు. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇందులో నటించిన హీరో నితిన్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. హీరోయిన్ గా నటించిన సదా కూడా ఓ రేంజ్ లో నటించి మానేసింది. అయితే హీరోయిన్ చెల్లెలుగా నటించిన అమ్మాయి గుర్తుండే ఉంటుంది. అన్నీ ఉల్టాపల్టాగా రాసే ఈమె ప్రస్తుతం ఎలా ఉందంటే..?

సదా చెల్లెలిగా నటించిన అమ్మాయి పేరు యామిని శ్వేత. జయం సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. చలాకీ చెల్లెలగా నటించిన ఈమె హీరో, హీరోయిన్ల ప్రేమకు సహకరిస్తుంది. తెలుగు పదాలను తికమక రాసే అమ్మాయిగా గుర్తింపు పొందింది. ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్లవుతుంది. ఇప్పుడు యామిని శ్వేత ఎంత పెద్దదువుతోందో తెలిసే ఉంటుంది. హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. యామిని శ్వేత మిగతా వాళ్లలాగా హీరోయిన్ అవ్వలేదు. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ జీవితాన్ని గడుతుపుతోంది. ఇందుకు ఓ కారణం ఉంది.

యామిని శ్వేత తల్లి జయలక్ష్మి కూడా నటినే. తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఈమె సినీ ఇండస్ట్రీలో కష్టాలను కళ్లారా చూసింది. తాను పడే కష్టాలను తన ఇద్దరమ్మాయిలు పడొద్దని అనుకుంది. ఇందులో భాగంగా వారిని సినీ ఇండస్ట్రీ వైపు తీసుకెళ్లలేదు. అయితే వారిలో ఒక కూతురుకు మాత్రం చైల్డ్ ఆర్టిస్టుగా చేయాలని ఉండేదట. ఆమె కోరిక ప్రకారం తేజ తన సినిమాలో అడగ్గా నటించడానికి ఒప్పుకుందట. అయితే ఆ తరువాత మరో సినిమాలో నటించాలనుకోలేదు. అయితే యామిని శ్వేత పెద్దయ్యాక చాలా మంది డైరెక్టర్లు హీరోయిన్ కోసం అడిగారట. కానీ జయలక్ష్మి అమెకు పెళ్లి చేసి అమెరికాకు పంపించింది. ప్రస్తుతం యామిని శ్వేత విజయవాడకు తిరిగొచ్చారు. ఇక్కడే ఉంటున్నారు.

Leave a Comment