స్నానం చేసిన వీడియోను షేర్ చేసిన మంచు లక్ష్మీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచులక్ష్మి గురించి తెలియని వారుండరు. ఆమె ఎక్కువగా సినిమాల్లో నటించకపోయినా మంచు వారి ఆడబిడ్డగా అందరికీ పరిచయమే. సినిమాలు, టీవీ షో ల ద్వారా సొంత ఇమేజ్ తెచ్చుకుంది మంచు లక్ష్మీ. ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన పిక్చర్స్ కు కూడా ఆమె యజమానిగా ఉన్నారు. కేవలం ఇండస్ట్రీ పరంగా కాకుండా సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేస్తూ వైరల్ గా నిలుస్తూ ఉంటారు. పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటూ అభిమానుల కామెంట్లకు రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆమె గంగానదిలో స్నానం చేసిన ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె ప్రవర్తనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి అమెరికాలో విద్యాభ్యాసం చేసింది. అక్కడే కొన్ని టీవీ చానెళ్లో పనిచేసింద. ఆ తరువాత ఇండియాకు తిరిగొచ్చింది. అయితే ‘అనగనగా ఓ ధీరుడు’అనే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే పలు టీవీ షోల ద్వారా ఫేమస్ అయిన ఆమె సినిమా ఎంట్రీ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత గుండెల్లో గోదావరి, బుడుగు వంటి సినిమాల్లో నటించడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా పనిచేశారు.

సినిమాల్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటుంది. మంచు ఫ్యామిలీపై ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ చేసినా ఆమె స్పందిస్తూ ఉంటుంది. ఇటీవల మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా సమయంలో కొందరిపై మంచు లక్ష్మీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం మంచు లక్ష్మి వ్యాఖ్యల్లో తప్పులను వెతికి వాటిని వైరల్ చేశారు.

తాజాగా మంచు లక్ష్మి వీడియోను షేర్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది. గంగానదిలో ఆమె స్నానం చేస్తున్న వీడియోను తీయించుకొన మరీ షేర్ చేసింది. గంగానదిలో భయపడుకుంటూ ఆమె పుణ్యస్నానం చేస్తూ.. దేవుడికి దండం పెడెతున్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా గంగానది నీరు ఎలా ఉన్నాయంటూ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Leave a Comment