హిట్టు తప్ప ప్లాప్ అంటే తెలియని డైరెక్టర్లు ఎవరంటే..?

ఒక సినిమా తీయాలంటే ఎంతో మంది చేయి పడాలి. హీరో నుంచి లైటింగ్ బాయ్ వరకు ప్రతి ఒక్కరు తమ విధులను నిర్వహిస్తేనే మూవీ కంప్లీట్ అవుతుంది. అయితే ఇంత మంది మాత్రం ఒక్కరు చెప్పినట్లే వినాలి. ఆయనే డైరెక్టర్. సినిమా కథ నుంచి టెక్నీషియన్స్ వరకు అన్నీ బాధ్యతలు డైరెక్టర్ పైనే ఉంటుంది. అందుకే డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక సినిమాకు హీరో హైప్ క్రియేట్ చేసినా స్టోరీ బాగుంటేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే ఇవన్నీ చూసుకుంటూ వరుసగా హిట్టు సినిమాలు తీయడం సాధ్యం కాదు. కానీ మన ఇండియన్ డైరెక్టర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ సినిమా చూడకుండా ముందుకు వెళ్తున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో చూద్దాం..

రాజమౌళి:
తెలుగు సినిమా రేంజ్ ను వరల్డ్ వైడ్ గ్ పెంచడంలో రాజమౌళి కృషి ఎంతో ఉంది. స్టోరీ సెలెక్షన్ నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఎంతో మేనేజ్ చేయగల సత్తా రాజమౌళికి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే జక్కన్న సినిమాలో ఆర్టిస్టుల సంఖ్య వందల కొద్దీ ఉంటారు. అంతేకాకుండా హౌ టెక్నీషియన్ష్ పనిచేస్తారు. వీరిని మేనేజ్ చేసుకుంటూ హిట్టు సినిమాలు తీశాడు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి మొన్నటి ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపు హిట్టు కొట్టినవే.

ప్రశాంత్ నీల్:
ఒకే ఒక్క సినిమా కేజీఎఫ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ డైరెక్టర్ ను పొగడక తప్పదు. ఎందుకంటే అలాంటి స్క్రీన్ ప్లే చేయడం సాహసంతో కూడిన పని. కానీ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పార్ట్ వన్ కాకుండా పార్ట్ 2 తీసి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఉగ్రం అనే సినిమాతో కూడా టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

అట్లీ:
తమిళ సినీ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ అట్లీ. మెర్సల్, రాజారాణి, థెహ్రీ, రత్నాకర్ అనే సినిమాలతో ఫేమస్ అయ్యాడు. త్వరలో జవాన్ అనే సినిమా రాబోతుంది. తక్కువ సినిమాలు చేసినా అట్లీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన తీసిన సినిమాల్లో ఒక్కటీ ప్లాప్ కాలేదు.

లోకేశ్ కనకరాజు:
లోకేశ్ కనకరాజు తీసిన సినిమాల్లో ఒక్కటీ ప్లాప్ కాలేదు. నగరం, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో టాప్ డైరెక్టర్ అయ్యాడు.

వెట్రీ మారన్:
ఎక్కువగా ధనుష్ తోనే సినిమాలు తీసిన డైరెక్టర్ వెట్రీ మారన్. ఈయన తీసిన ఐదు సినిమాల్లో అన్నీ సూపర్ హిట్టు కొట్టినవే. ఒక్క ప్లాప్ కూడా ఇదివరకు చూడలేదు.

రాజకుమార్ హిరని:
త్రీ ఇడియట్స్, పీకే, మున్నాభాయ్ వంటి సంచలన చిత్రాలు తీసిన రాజు కుమార్ హిరాని గురించి ఎవరూ మరిచిపోరు. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడలేదు.

Leave a Comment