వియ్యంకులు కావాల్సిన చిరంజీవి-వెంకటేశ్..: మరెక్కడ చెడింది..?

తెలుగు సినిమా పరిశ్రమలో ఉండే చాలా మంది నటులు ఆ తరువాత బంధువులుగా మారారు. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ నుంచి నేటి అక్కినే నాగచైతన్య వరకు సినిమా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారినే పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిలో కొందరు జీవితాంతం కలిసుండగా మరికొందరు మనస్పర్థలతో విడిపోయారు. సినిమా పరిశ్రమలో ఇద్దరు సమ ఉజ్జీలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ లు వియ్యంకులు కావాల్సి ఉండేంది. అంటే రామ్ చరణ్, వెంకటేశ్ కూతురు ఆశ్రితలకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. ఇంతకీ అసలు ఏం జరిగింది..? ఇది ఎందుకు సాధ్యం కాలేదు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే గుర్తింపు ఎంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే విక్టరీ వెంకటేశ్ కూడా తనదైన శైలిలో నటిస్తూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. వెంకటేశ్ కు సినీ బ్యాక్రౌండ్ ఉన్న హీరోగా ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించాడు. అటు మెగాస్టార్ ను సక్సెస్ కు మారుపేరు అనేవారు. అయితే వీరిద్దరు పోటీపడి సినిమాలు తీసినా ఇద్దరు కలిసి ఒకే సినిమాల్లో మాత్రం నటించలేదు. కానీ ఇద్దరు వియ్యంకులు కావాలని అనుకున్నారట.

రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దూసుకెళ్తున్న సమయంలో అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించాడట చిరంజీవి. ఈ క్రమంలో అప్పటికే తనతో పాటు ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు ఉన్న వెంకటేశ్ కూతురికి ఇస్తే బాగుంటుంది అనుకున్నారట. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటలు కూడా జరిగాయట. అయితే ఇదే విషయాన్ని రామ్ చరణ్ ను అడగ్గా సున్నితంగా నో చెప్పాడట. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చిరంజీవికి చెప్పాడట.

ఎందుకంటే అప్పటికే తాను ఉపాసనతో ప్రేమలో ఉన్నట్లు రామ్ చరణ్ చిరంజీవితో చెప్పాడని సమాచారం. దీంతో చెర్రీ మాటకు విలువిచ్చిన చిరు ఉపాసనను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో వారి పెళ్లి జరిగిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అటు వెంకటేశ్ కూతురు సైతం అప్పటికే మరో వ్యక్తిని ప్రేమిస్తంది. దీంతో ఎవరికి వారు వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ హాయిగా ఉన్నారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయని అంటారు. అందుకే పెద్దలు అనుకున్న పెళ్లి కాకుండా వారి ఇష్టం కోసం పెళ్లి చేసుకున్నారు.

Leave a Comment