మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకత ఉంది. ఆ కుటుంబం నుంచి దాదాపు అందరూ ఇండస్ట్రీలో ఏదో రంగంలో ఉన్నారు. కలెక్షన్ కింగ్ నట ప్రపూర్ణగా వెలుగొందిన మోహన్ బాబు 500లకు పైగా చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మోహన్ బాబు రెండో కుమారుడైన మంచు మనోజ్ ని చిన్నప్పుడే ఫీల్డ్ లోకి తీసుకొచ్చారు మోహన్ బాబు. అయితే ఆయన మధ్యలో చదువు కోసం గ్యాప్ ఇచ్చి ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచు మనోజ్ ప్రణతి అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఇటీవల ఆయన రెండో వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన మొదటి భార్య ఏం చేస్తుందన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.

సినిమాల్లో తప్ప మంచు మనోజ్ బయట ఆయన పేరు వినిపించదు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన ఇటీవల మోహన్ బాబు పై వచ్చిన ట్రోలింగ్ పై స్పందించారు. ‘దొంగ దొంగది’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరో అయ్యాడు. అయితే ఆ తరువాత హిట్టూ, ఫట్టు తో సంబంధం లేకుండా చాలా సినిమాల్లో నటించాడు. కానీ మంచు మనోజ్ కు సరైన బ్రేక్ ఇవ్వలేదు. ఆయన సినిమా వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఆయన సినిమా కోసం మంచు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

ఇటీవల మంచు మనోజ్ పేరు బాగా వినిపిస్తోంది. ఆయన కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలిని పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మంచు మనోజ్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటారన్న వార్తలు బయటపడడంతో ఆయన మొదటి వివాహం పై చర్చలు తీవ్ర మయ్యాయి. అంతకుముందు ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తతం ఆమె ఎక్కడ ఉందో.. ఏం చేస్తుందోనని చర్చించుకుంటున్నారు.

మనోజ్ తో విడిపోయిన తరువాత ప్రణతి రెడ్డి మళ్లీ ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఆమె ప్రస్తుతం సింగిల్ గానే అమెరికాలో ఉంటోంది. అమెరికాలోని ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్రా గా కొనసాగుతున్నారు. గతంలో మంచు మనోజ్ తో విడాకులు తీసుకున్న సమయంలో ఆమె పేరు మారుమోగింది. ప్రస్తుతం ప్రణతి రెడ్డి మరోమారు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

Leave a Comment