మేకప్ మెన్ కుటుంబానికి భారీ సాయం.. మంచి మనసు చాటుకున్న రావు రమేశ్..

కొందరు సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తారు. కానీ రియల్ లైఫ్ కొచ్చేసరికి చెండాలంగా ఉంటారు.. కానీ మరికొందరు వెండితెరపై విలన్లుగా కనిపిస్తారు. కానీ రియల్ లైఫ్లో మానవతా దృక్ఫథంతో మెదులుతారు. సినిమాల్లో క్రూర విలన్ గా కనిపించే కొందరు ఇటీవల రియల్ హీరోలుగా మారుతున్నారు. మొన్నటి సోనూసుద్ గురించి అందరికీ తెలసిందే. ఆయన సినిమాల్లో కరుడు గట్టిన విలన్ గా కనిపించినా.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందిని ఆదుకొని వారి జీవితాన్ని నిలబెట్టాడు. తాజాగా తెలుగు సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రావు రమేశ్ ఓ పెద్ద సాయం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ రావు రమేశ్ ఏం చేశాడంటే..?

అలనాటి సినిమాల్లో రావుగోపాల్ రావు ఉన్నాడంటే సినిమా అద్భుతంగా ఉంటుందనే భావన ఉండేది. అందుకే కొందరు డైరెక్టర్లు తమ సినిమాల్లో రావుగోపాల్ రావును కచ్చితంగా పెట్టుకునేవారు. అయన కుమారుడు రావు రమేశ్ రావుగోపాల్ రావు వారసత్వాన్ని అందుకున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే అచ్చం తండ్రిలా డైలాగ్ లు కొడుతూ ఆకట్టుకుంటున్నారు. హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండానే అనేక సినిమాల్లో నటించిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అగ్రహీరోల సినిమాల్లోనూ నటించి రావు రమేశ్ వారి మెప్పు పొందాడు.

అయితే రావు రమేశ్ సినిమాల్లో విలన్ కావొచ్చు. కానీ రియల్ గా ఆయన మంచి మనసున్న వ్యక్తి. ఆ విషయం ఇటీవల నిరూపించుకున్నాడు. ఇటీవల తనకు పర్సనల్ గా మేకప్ వేసే వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. దీంతో రోజూ తనదగ్గరికి వచ్చే వ్యక్తి ఇక రాడని తెలియడంతో రావు రమేశ్ చలించిపోయాడు. దీంతో ఆయన వెంటనే మేకప్ మెన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. అంతేకాకుండా వెంటనే వారికి రూ.10 లక్షల రూపాయలు అందించారు. ఇక ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని వారికి అభయం ఇచ్చాడు

ఇటీవల సినీ రంగానికి చెందిన వారు కష్టాల్లో ఉంటే చాలా మంది స్పందిస్తున్నారు. అయితే విలన్ పాత్రలు వేసే వారే ఎక్కువగా స్పందించడం ఆసక్తిగా మారింది. అయితే ప్రతి ఒక్కరికి జీవితం విలువ అర్థమైతే ఇలా ఒకరికొకరు సాయంగా ఉంటారని నెటిజన్లు రావు రమేశ్ ను ప్రశంసిస్తున్నారు. ఆయనలా మరికొంత మంది ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరుతుననారు.

Leave a Comment