గాజువాక ఝాన్సీ పాత వీడియోలు వైరల్.

ప్రతి ఒక్కరి టాలెంట్ బయటపడేందుకు సోషల్ మీడియా వేదికలా మారింది. తమకున్న ప్రతిభను వీడియోను తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో చాలా మందికి అనేక అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా సినీరంగంలో అడుగుపెట్టాలనుకునేవారికి ఇదో వరంలా మారింది. తాజాగా ఓ లేడీ కండక్టర్ టాలెంట్ బయటపడడానికి సోషల్ మీడియా ఉపయోగపడిందనే చెప్పొచ్చు. ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలతో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో నిర్వాహకులు ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఆమెకు ఈ షోలో చాన్స్ ఇవ్వడంతో ఆమె ఫేమస్ అయ్యింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన పాత వీడియోలు కూడా వైరల్ కావడం విశేషం.

గాజువాక కండక్టర్ ఝాన్సీ.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. మొన్నటి వరకు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగానికి ఎవరు వచ్చారని అడిగితే.. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు గాజువాక ఝాన్సీ పేరు కూడా చెప్పొచ్చు. కండక్టర్ గా వృత్తి చేస్తూనే డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ ప్రస్తుతం ఫేమస్ ఆర్టిస్టుగా మారింది. అంకుముందు పలు టీవీ షోల్లో ఝాన్సీ పాల్గొన్నారు. కానీ తగినంత గుర్తింపు రాలేదు. ఇలా 11 ఏళ్ల పాటు శ్రమించిన తరువాత ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో పల్సర్ బండి పాటకు ఆమె స్టెప్పులు చూసి ఫిదా అయ్యారు.

అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో గాజువాక ఝాన్సీ పేరు మారుమోగుతోంది. లేడి కండక్టర్ గా విధులు నిర్వహిస్తూ డ్యాన్స్ చేయడం మాములు విషయం కాదని కొందరు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు సినిమాల్లో చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆమె చేసే డ్యాన్స్ స్టెప్పులు పురుషులు కూడా వేయలేరని కొందరు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఝాన్సీకి సంబంధించిన పాత వీడియోలు ఇప్పుుడు వైరల్ గామారాయి. అంతకుముందు ప్రత్యేక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేసిన వీడియోలను కొందరు తమ ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీటిలో ‘ఒక్కమగాడు’ అనే సాంగ్ కు ఝాన్సీ వేసిన స్టెప్పుులు కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అలాగే అంతకుముందు వీడియోలు కూడా ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. ఈ క్రమంలో ఝాన్సీ ముందు ముందు మరింత ఫేమస్ ఆర్టిస్టు కావాలని కొందరు కోరుతున్నారు.

Leave a Comment