మీనా ఒకప్పటి అందాల ఫొటోలను చూస్తే షాకవుతారు..

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అరుదు. ఒకవేళ వస్తే వాటిని సద్వినియోగం చేసుకున్నవారే సక్సెస్ అవుతారు. బాలనటిగా.. హీరోగా.. ఎలాగైనా కెమెరా ముందుకు ఒక్కసారి వస్తే దాదాపు జీవితం సెటిలైపోతుంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పెద్ద హీరోయిన్లు అయిన వారు ఎందరో ఉన్నారు. అలనాటీ శ్రీదేవి బాల నటిగా వెండితెరపై కనిపించి ఆ తరువాత పాన్ ఇండియా స్టార్ నటిగా వెలుగొందారు. ఈమె లాగే నటి మీనా కూడా బాల నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత సౌత్ వైడ్ హీరోలందరితో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో స్టార్ నటిగా ఉన్న ఆమె వివాహం కాగానే వెండితెరను వదిలిపోయారు. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ తరుణంలో మీనా ఏం చేస్తుందో తెలుసుకుందాం..

నటి మీనా 1982లో తమిళ చిత్రం ‘నెంజగల్’తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ ‘సిరిపురం మొనగాడు’ అనే సినిమాలోనూ బాల నటిగా కనిపంచారు. సిరివెన్నెల సినిమాలో మీనా నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టిన ఆమె ఆ తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. మీనా 1984లో రజనీ కాంత్ సినిమా ‘అన్బుళ్ల’లో బాల నటిగా కనిపించారు. అదే రజనీకాంత్ తో 1993లో ‘యాజమాన్’ అనే సినిమాలో హీరోయిన్ గా చేశారు. ఇక ‘సిరిపురం మొనగాడు’ బాలనటిగా కనిపించిన ఆమె అదే కృష్ణతో ‘ఇంద్రభవనం’ సినిమాలో హీరోయిన్ గా కనిపంచింది.

తెలుగులో ‘నవయుగం’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఆమె ఆ తరువాత రెండు తరాల నాయకులతో కలిసి నటించింది. చిరంజీవి, మెగాస్టార్, వెంకటేశ్, నాగార్జున లాంటి తెలుగు అగ్రహీరోలతోనే కాకుండా తమిళ స్టార్లందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేశ్ తో కలిసి నటించిన ‘చంటి’ మీనాకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత నాగార్జునతో కలిసి ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ సినిమాతో స్టార్ నటిగా మారింది.

సౌందర్య, రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చిన మీనా ఆ తరువాత పెళ్లి చేసుకొని ఫ్యామిలీ వైపు వెళ్లింది. సినిమాల్లో ఉన్నంత కాలం గ్లామర్ పాత్రలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత వెంకటేశ్ తో కలిసి దృశ్యం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా తన లైఫ్ సక్సెస్ గా కొనసాగుతున్నతరుణంలో ఆమె భర్త మరణించడంతో శోకసంద్రంలో మునిగింది. కాగా ఇటీవల మీనా కు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Leave a Comment