పవన్ తో నటించిన ఈ హీరోయన్ల కెరీర్ ముగిసినట్లేనా..?

సినిమాల్లో నటుడిగా రాణించాలంటే టాలెంట్ మాత్రమే కాదు..అదృష్టం కలిసిరావాలి.. సినిమా ప్రారంభించేటప్పుడు ఎన్నో లాంఛనాలతో మొదలుపెడుతారు. కొబ్బరికాయ కొట్టి, దిష్టిగుమ్మడికాయను పగుల గొడుతారు. ఎందుకంటే తమ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. కథ, నటులు బాగుండడమే కాకుండా సెంటిమెంట్ కూడా వర్కౌట్ కావడానికి ఇలా చేస్తారు. వీటితో పాటు కొందరు హీరో, హీరోయిన్ల కాంబినేషన్లను సెంటిమెంట్ గా ఫీలవుతారు. ఫలానా హీరో, హీరోయిన్ కలిసి సినిమా చేస్తే హిట్టవుతుందని నమ్ముతారు. అలా ఒకే హీరో, హీరోయిన్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో కొందరు హీరోలతో నటించిన హీరోయిన్లు మళ్లీ ఇండస్ట్రీ వైపు చూడలేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తో నటించిన అందమైన భామలు మళ్లీ సినిమాల్లోకి రాకుండా పరిశ్రమను వదిలిపోయారు. దీంతో పవన్ కల్యాణ్ తో హీరోయిన్ గా చేస్తే హీరోయన్ పని అంతేనా..? అన్న చర్చ సాగుతోంది. అలాంటి వారిలో 8 మంది గురించి తెలుసుకుందాం..

సుప్రియ:
పవన్ తో పాటు సుప్రియ కుడా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. పవన్ స్టార్ నటుడిగా ఎదిగారు. కానీ సుప్రియ మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.

దేవయాని:
పవన్ కల్యాణ్ తో దేవయాని ‘సుస్వాగతం’ సినిమాలో నటించింది. ప్రేమ కావ్యంగా వచ్చిన ఈ సినిమా సూపర్, డూపర్ హిట్టయింది. ఈ సినిమాలో పవన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో నటంచిన తరువాత దేవయాని ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. ఆ తరువాత తెలుగు పరిశ్రమను వదిలి తమిళ సినిమాల్లో నటించింది. అయితే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చి నటిస్తోంది.

ప్రీతి జింగానియా:
తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రీతి జింగాని మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించి. ఆ తరువాత పత్తా లేకుండా పోయింది.

కీర్తిరెడ్డి:
పవన్ కల్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్టు హిట్టుగా నిలిచిన తొలిప్రేమ సినిమాలో కీర్తిరెడ్డి హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. అయితే అర్జున్ సినిమాలో మహేశ్ బాబుకు అక్కగా నటించింది. ఆ తరువాత ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయింది.

రేణు దేశాయ్:
పవన్ కల్యాణ్ తో మాత్రమే రెండు సినిమాల్లో కనిపించిన రేణు దేశాయ్ ఆ తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. కానీ పవన్ ను పెళ్లి చేసుకొని హీరోయిన్ గా కెరీర్ ముగించేసింది. ఆ తరువాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.

నేహా ఒబెరాయ్:
బాలు సినిమాలో పవన్ కు జోడికా కనిపించిన నేహ ఒబేరాయ్ మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు. ఇండస్ట్రీ వైపు మళ్లీ చూడలేదు.

మీరా చోప్రా:
బంగారం సినిమాలో కనిపంచిన మీరా చోప్రా ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే మెరిసింది. ఆ తరువాత ఇండస్ట్రీని వదిలి వెళ్లింది.

అంజలి లావానియా:
పంజా సినిమాలో పవన్ తో చేసిన అంజలి లావానియగా మల్లీ సినిమాల వైపు రాలేదు.

Leave a Comment