కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు వీరే..

భారతదేశంలో కుల వ్యవస్థకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ కులాల ప్రాతిపదికన పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ ఈ వ్యవస్థ మారుతోంది. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కులాల గురించి పట్టించుకోవడం లేదు. ఇలా కులాంతత వివాహాలు చేసుకున్న వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే వీళ్లు అప్పటికే సాంప్రదాయ వివాహం చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల కులాంతర వివాహం చేసుకోవాల్సి వచ్చింది. మరి అలాంటి వాళ్లెవరో చూద్దాం..

అక్కినేని నాగార్జున- అమల:
టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున నటన ప్రత్యేకంగా ఉంటుంది. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి బంధం ఏర్పడింది. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కూతురు లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య జన్మించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తరువాత నాగార్జున ఉత్తరాదికి చెందిన అమలను పెళ్లి చేసుకున్నారు.

కృష్ణ- విజయనిర్మల:
అలనాటి హీరోల్లో కృష్ణ ఒకరు. ఆయన నటన గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. కృష్ణ ముందుగా ఇందిరా దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువా జేమ్స్ బాండ్ సినిమా తీస్తున్న సమయంలో విజయనిర్మలను ప్రేమించాడు. ఆ తరువాత పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల కిందట విజయనిర్మల మరణించిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ -రేణు దేశాయ్:
పవర్ స్టార్ గా పేరున్న పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఆనందం. ఆక్ష్న పర్సనల్ విషయానికొస్తే ముందుగా నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెతో విడాకులు తీసుకున్న తరువాత రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరు కూడా విడిపోవడం గమనార్హం. ఆ తరువాత రష్యన్ నటిని పెళ్లి చేసుకొని ఆమెతో కలిసి జీవిస్తున్నారు.

Leave a Comment