సౌందర్య మరణం తర్వాత భర్త ఏం చేస్తున్నాడో తెలుసా..?

సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తారలు అకాల మరణాలు చెందారు. తమ నటనతో ఆకట్టుకున్నవారు జీవితాన్ని మధ్యలోనే ముగించడంతో వారి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సౌత్ సూపర్ స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగిన సౌందర్య అంటే ఇష్టం లేనివారు ఉండరు. అప్పట్లో ఆమె నటించిన ప్రతీ సినిమాను విడిచిపెట్టకుండా చూసేవారు. సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోకముందే 2003లో ఆమె అకాల మరణం చెందారు.ఆమె మరణం కుటుంబ సభ్యులకే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులను కలిచివేసింది. ఇప్పటికీ సౌందర్య నటించిన చిత్రాలు, ఆమె మాట్లాడిన వీడియోలు చూస్తూ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇక సౌందర్య పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఈ లోకం విడిచి వెళ్లారు. ఈ తరుణంలో ఆమె భర్త ఎలా ఉన్నాడు..? అసలేం చేస్తున్నాడు..? అనే చర్చ సాగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ ఇలా చిత్ర పరిశ్రమలోని దాదాపు అగ్రహీరోలందరితో సౌందర్య నటించింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిలా ఉండడంతో ఆమెకు తెలుగు అభిమానులు చాలా మందే ఉన్నారు. ప్రతీ ఇంట్లో సౌందర్య లాంటి అమ్మాయి ఉండాలని కోరుకునేవారు. ఇక మహిళా ప్రేక్షకులైతే సౌందర్య నటించిన ప్రతీ సినిమాను విడిచిపెట్టకుండా చూసేవారు. సౌందర్య మరణించిన తరువాత కొందరు మహిళలే శోకం పెట్టి ఏడ్చిన సంగతి తెలిసిందే.

వందలకొద్దీ సినిమాలు తీసినా సౌందర్య సాంప్రదాయాన్ని మాత్రం వీడలేదు. ఎలాంటి వివాదాలకు పోకుండా అందరితో కలివిడిగా ఉండేవారు. ఈ క్రమంలో ఆమె చిన్ననాటి స్నేహితుడు, మేమమామ వరుసైన రఘు అనే వ్యక్తిని 2003లో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగి ఏడాది కాకముందే ఆమె మరణించడంతో రఘు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. రఘు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే బంధువుల బలవంతంతో రఘు 2011లో మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

ప్రస్తతం రఘు గోవాలో నివసిస్తున్నాడు. అయితే సౌందర్య ఎంతో కష్టపడిన ఇంట్లో మాత్రం ఎవరూ ఉండడం లేదు. ఆ ఇల్లు బూత్ బంగ్లాగా మారిపోయింది. అటు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో సౌందర్యకు నివాళులర్పిస్తున్నారు. ఆమె ఎక్కుడున్నా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు. అశేష అభిమానులను సంపాదించుకున్న సౌందర్య లాంటి మరో హీరోయిన్ ఇప్పటి వరకు రాలేదని కొందరు అంటున్నారు.

Leave a Comment