పెళ్లిపీటలపైనే వరుడికి ముద్దుల వర్షం: వీడియో వైరల్

ప్రతీ అమ్మాయికి రెండు జీవితాలుంటాయి. ఒకటి పుట్టినింట్లో జీవితం..మరొకటి మెట్టినింటి సంసారం.. పుట్టింట్లో అమ్మాయి ఎంతో గారాభంగా పెరుగుతుంది. మెట్టినింటికి వెళ్లే సమయం వచ్చే సరికి ఏ అమ్మాయయైనా కాస్త భయంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు ఇల్లు, ఇంటి చుట్టుపక్కనవాళ్లు తెలిసినవారు కనిపిస్తారు. కానీ అప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ కొత్తవారే. ఆ జీవితాన్ని తట్టుకుని ఎలా ఉండాలోనని అమ్మాయిలు ముందే భయంతో ఉంటారు. ఈ తరుణంలో పెళ్లి సమయంలోకూడా అందరినీ విడిచి వెళ్తున్నామనే బాధతోనే కనిపిస్తారు. కానీ ఓ పెళ్లికూతురిలో అలాంటి లక్షణాలేమీ కనిపించలేదు. పెళ్లిపీటలపై చప్పట్లు కొడుతూ.. కాబోయే భర్తను ముద్దుల వర్షంలో కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇంతకీ ఆ వీడియో విశేసాలేంటంటే..?

ఈ కాలం అమ్మాయిలూ చాలా ఫాస్ట్ గా మారిపోయారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో సొంత నిర్ణయాలే తీసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు సంబంధాలు చూసినా అబ్బాయిని మాత్రం తమకు అనుగుణంగా ఉన్నాడా..? అన్న విషయం నిర్దారించుకున్న తరువాతే పెళ్లికి ఓకే చెబుతున్నారు. ఈ తరుణంలో అబ్బాయి బాగున్నాడని అనుకుంటే సంతోషంగా పుట్టినింటిని వదిలి వెళ్తున్నారు. ఇక కొందరైతే పెళ్లి భారత్లో కూడా డ్యాన్సులు చేస్తూ ఆనందంగా వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఓ పెళ్లి కూతురు తాళికట్టే సమయంలోనే ఫుల్ హ్యపీగా మారింది.

తమిళ సాంప్రదాయంలో ఓ పెళ్లి జరుగుతోంది. వరుడు చేతికి తాళిని తీసుకోగానే ఆ అమ్మాయికి పూనకం వచ్చినట్లు సంతోషంగా మారింది. వెంటనే చప్పట్లు కొట్టింది. చిన్నపిల్లలా ఎంతో హ్యాపీగా మారింది. ఇక వరుడు తాళికట్టిన తరువాత వెంటనే వరుడికి ముద్దుల మీద ముద్దులు పెట్ట సాగింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. కొందరు ఈ అరుదైన దృశ్యాన్ని వీడీయో తీశారు.

అలా ఫోన్లు మారిన ఈ వీడియో ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు. పెళ్లి సమయంలో ‘మీరు కూడా ఇలాగే చేస్తారా..?’ అని ప్రశ్నించాడు. దీంతో ఆయనకు అనేక సమాధానాలు వస్తున్నాయి. కొందరు లవ్ మ్యారేజ్ కావచ్చు.. అనుకున్న వివాహం అయినందునే యువతి సంతోషంగా ఉంది అని చెబుతున్నారు. ఏదీ ఏమైనా కాలం మారుతున్న కొద్దీ పెళ్లి విషయంలో ఏమాత్రం భయపడకుండా ఉండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంటున్నారు.

Leave a Comment