ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బంతా ఉంచుకోలేదు..: ఏంచేశాడంటే..?

తెలుగు సినీ పరిశ్రమలో నటులకు కొదువ లేదు. ఏ పాత్ర చేయడానికైనా కొందరు ముందుకు వస్తారు. కొందరు చేసే పాత్రల్లో మనుషులు ఇలాక్కూడా ఉంటారా..? అనే ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు సినిమాల్లో ఎంతో మంది విలన్ గా తమ విశ్వరూపాన్ని చూపించారు. ఆనాటి రావుగోపాల్ రావు నుంచి నేటి ప్రకాశ్ రాజ్ వరకు విలన్లు ఇలాగే ఉంటారు.. అనే విధంగా నటించారు. అయితే ఈ మధ్యలో కొంతమంది కూడా తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారిలో నర్రా వేంకటేశ్వర్ రావు ఒకరు. నర్రా వేంకటేశ్వర్ రావు ను గుర్తుపట్టని సినీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఆయన డైలాగ్, యాక్షన్ అందరికీ నచ్చుతుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అవకాశం వచ్చిన ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో విలన్ అయినా రియల్ గా మాత్రం దేవుడు అని అంటున్నారు. మరి ఆయనను అలా ఎందుకు అంటున్నారు..?

నేటి సినిమాల్లో విలన్ గా నటించిన సోనూసుద్ రియల్ గా హీరో అయిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసుద్ ఆపదలో ఆదుకునే వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే సోనూసుద్ లాంటి వ్యక్తులు కూడా గతంలో చాలా మంది ఉన్నారు. అప్పుడు మీడియా ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో అలాంటి విషయాలు బయటికి రాలేదు. ఇప్పుడు కొందరు ఏ చిన్న సాయం చేసినా వెంటనే సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తున్నాయి. గతంలో నర్రా వెంకటేశ్వర్ రావు కూడా ఓ పెద్ద సాయం చేశారు.

ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా వేంకటేశ్వర్ రావు 1947లో అగ్రహారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి నాటకాలు నటించిన అనుభవం ఉంది. అ అనుభవంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1974లో ‘చదువు సంస్కారం’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హస్యనటుడిగా 500కు పైగా సినిమాల్లో నటించాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ల సినిమాల్లో ఎక్కువగా నటించారు. దాసరి నారాయణ సినిమాల్లో నర్రా వేంకటేశ్వర్ రావు తప్పనిసరిగా కనిపిస్తారు. ‘ఓసెయ్ రాములమ్మ’ సినిమాలో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘మేస్త్రీ’ అనే సినిమాలో కనిపించాడు.

నర్రా వేంకటేశ్వర్ రావు కు భార్య సుశీల, కొడుకు మురళి, కూతరు వసంత లక్ష్మి ఉన్నారు. సినిమాల్లో నర్రా విలన్ గా కనిపించినా.. రియల్ గా మాత్రం ఆయన దేవుడంటున్నారు. వందల సినిమాల్లో నటించగా వచ్చిన డబ్బును ఆయన ఆస్తులు కూడబెట్టుకోలేదు. తన పిల్లలకకూ ఇవ్వలేదు. తన సొమ్మంతా ప్రజానాట్యమండలికి అప్పగించారు. ఎంతో మంది సినీ రంగానికి చెందిన వారు ఆస్తులను సంపాదించారు. కొందరు సేవ చేశారు. కానీ నర్రా వేంకటేశ్వర్ రావు మాత్రం తన సంపాదనంతా ఇలా ధారాదత్తం చేయడంతో ఆయనను మెచ్చుకోని వారు లేరు.

Leave a Comment