కోపతాపాలు తగ్గాలంటే ఒక వైపు నుంచి ప్రేమను చూపించాలి.. అప్పుడు మరో వైపు నుంచి కూడా ప్రేమ పుడుతుంది. ప్రభాస్ నటించిన సినిమాలో ఇలాంటి సీన్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రియల్ గా ఓ చిన్నపిల్లాడు దీనిని పాటించాడు. తనపై టీచర్ కు వచ్చిన కోపాన్ని తగ్గించడానికి ప్రేమను చూపించాడు. అంతేకాకుండా ఆ టీచర్ కు ముద్దులు కూడా పెట్టాడు. దీంతో ఆ టీచర్ వెంటనే శాంతించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే..?

ప్రతీ మనిషిలో కోపం ఉండడం సహజం. అయితే అందరిలో ఇది సమానంగా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. కొన్ని పరిస్థితుల వల్ల కొందరిలో ఎక్కువగానూ..మరికొందరిలో తక్కువగానూ.. ఉండొచ్చు. అయితే రోజూ తినే ఆహారంతో పాటు ఇంట్లో గొడవల వల్ల పిల్లల్లోనూ కోపం పెరిగిపోతుంది. కోపాన్ని చల్లార్చడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. చిన్నపిల్లలకు కోపం వస్తే చాక్లెట్ లేదా.. వారి మనసుకు నచ్చే ఏదో ఒక పనిని చేసి వారిని శాంత పర్చవచ్చు. మరి పిల్లలపై పెద్దలకు కోపం వస్తే పిల్లలు ఏం చేస్తారు..? సాధారణంగా అయితే శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఓ బుడ్డోడు తనపై టీచర్ కు వచ్చిన కోపాన్ని వెంటనే చల్లార్చాడు. ఇంతకీ ఆ బడ్డోడు ఏం చేశాడు..? ఆ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది..?

పిల్లలు తప్పు చేస్తే దండించే హక్కు తల్లిదండ్రులతో పాటు చదువు నేర్పే గురువులకూ హక్కు ఉంటుంది. అయితే కొందరు చెంప చెల్లుమనిపించకపోయినా తమ భయంతో పిల్లలను అదుపులో పెడుతారు. ఈ తరుణంలో కొందరు పిల్లలు భయంతో ఉండవచ్చు.. ఉండకపోవచ్చు.. కానీ వారిలో కోపం తగ్గించే గుణం ఉంటుందని మాత్రం ఎవరూ అనుకోరు. ఈరోజుల్లో పెద్దవాళ్లలోనూ చాలా మందిలో ఉండకపోవచ్చు. కానీ ఈ పిల్లాడిలో మాత్రం ఉంది.

నర్సరీ లేదా ఎల్కేజీ చదివే ఓ చిన్నారి ఏదో తప్పు చేసినట్టున్నాడు. దీంతో అక్కడున్న టీచర్ కు కోపం వచ్చింది. పదే పదే ఈ తప్పు చేస్తున్నావంటూ ఆ పిల్లాడిపై టీచర్ మండిపడింది. అయితే సాధారణంగా ఇలా టీచర్ కు కోపం వస్తే విద్యార్థులు భయంతో వణికిపోతారు. లేదా ఏడుస్తుంటారు. కానీ ఆ బడ్డోడు అందరిలా కాకుండా ఆ టీచర్ భుజాలపై చేయి వేసి ముద్దు పెట్టేశాడు. అంతేకాకుండా ‘ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను టీచర్..’ అని వేడుకున్నాడు. అప్పటికీ టీచ్ కూల్ అయింది ‘ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయవు కదా..’ అని ప్రామిస్ చేయించుకుంది. అని మరోసారి ముద్దు పెట్టి అని టీచర్ అడిగింది. దీంతో బుడ్డోడు ఆ టీచర్ కు మళ్లీ ముద్దు పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here