బొద్దుగా ఉన్న తగ్గేదేలే.. ప్రభాస్ హీరోయిన్ లెటేస్ట్ వీడియో వైరల్..

అందం, అభినయంతో పాటు ఆకర్షించేవిధంగా ఉన్న నమితకు ఒకప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. సొంతం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె రెండో సినిమాలో వెంకటేశ్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత అవకాశాల పరంపర కొనసాగాయి. అయితే మధ్యలో కాస్త లావు అయిన తరువాత నమిత ఇండస్ట్రీకి దూరమైంది. అయినా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ కు నిర్మాతగా మారిన నమిత.. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం చేసిందంటే..?

వెండితెరపై కనిపించే చాలా మంది నటులు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ గా మారుతున్నారు. వారు చేసే పర్సనల్ యాక్టివిట్ కు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ప్రతీరోజూ తమ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. ఇదే దారిలో నమిత కూడా సోషల్ మీడియాలో ట్రెండీ పర్సన్ గా మారింది. సినిమాలు మానుకున్న తరువాత కనిపించని నమిత ఇటీవల సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది.

కొందరు హీరోయిన్లు డ్యాన్స్ చేయడం సినిమాల్లోనే చూస్తాం. కానీ హిట్ సాంగ్స్ కు రియల్ గా కూడా డ్యాన్స్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. నమిత కూడా ఓ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. నందుతో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. అయితే కాస్త బొద్దుగా ఉన్న నమిత ఏమాత్రం పట్టించుకోకుండా మాస్ స్టెప్స్ వేస్తూ యూత్ ను బాగా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో హైలెట్ కావడానికి చాలా మంది సాధారణ మహిళలు కూడా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా నమిత చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.

శ్రీను వైట్ల డైరెక్షన్లో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నమిత ఆ తరువాత వెంకటేశ్ తో కలిసి జెమిని సినిమాలో కనిపించింది. ఆ తరువాత కాస్త బొద్దుగా మారిన తరువాత ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయినా ప్రభాస్ తో కలిసి ‘బిల్లా’ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ కాకపోయినా ఆమెకు ప్రత్యేక గుర్తింపే వచ్చింది. అయితే ఆ తరువాత నుంచి నమిత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల మళ్లీ ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment