సన్నని నడుమును తీగవలె వంచిన విష్ణుప్రియ: ఎందుకో తెలుసా..:

వెండితెరపై రాణించాలనుకునే వారు వయా బుల్లితెరపై తమ ప్రతిభను చూపిస్తారు. అయితే ఒక్కోసారి ఇక్కడ సక్సెస్ సాధించాకా టీవీ షోలకే పరిమితం అవతారు. యాంకర్ విష్ణుప్రియ లైఫ్లోనూ అదే జరిగింది. సినిమాల్లో కనిపించాలన్న తాపత్రమం ఆమెను టీవీల వైపు తీసుకెళ్లింది. ఇక్కడ యాంకర్ గా సక్సెస్ సాధించింది. ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి దూసుకుపోతుంది. ఇక ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలకు ట్రై చేస్తోంది విష్ణుప్రియ. అయితే ఇటీవల ఆమెకు సుడిగాలి సుధీర్ తో కలిసి నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విష్ణుప్రియ మంచి జోష్ లో ఉన్నట్లుంది. అందుకే ఓ డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఈమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గతంలోనూ విష్ణుప్రియ సన్నని నడుముతో వయ్యారాలను వొలకించింది. మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటూనే.. సాంప్రదాయ గీతానికి తన నడుమును తీగవలె వంచి చూపించింది. తాజాగా ఆమె మరో మాస్ స్టెప్ వేసింది. రెండు చేతులు అటూ ఇటూ వంచుతూ.. నడుమును బెండువలె వంచి డ్యాన్స్ చేసింది. అచ్చం డ్యాన్సర్ వేసిన స్టెప్పులను అనుసరిస్తూ ఏమాత్రం తగ్గేదేలే.. అన్నట్లుగా డ్యాన్స్ చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ల ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకున్న విష్ణుప్రియ ఆమె నుంచి ఎలాంటి వీడియో వస్తుందా..? అని ఎదురుచూస్తుంటారు. తాజాగ వచ్చిన వీడియోతో పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ డ్యాన్స్ కు కారణమేంటని మాత్రం విష్ణుప్రియ చెప్పలేదు. సరదా కోసం చేసిందా..? లేక సినిమా కోసమా..? అని కొందరు ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రం ఓ చర్చ ప్రారంభమైంది.

డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలో నటించే అవకాశాన్ని విష్ణుప్రియ దక్కించుకుందని అంటున్నారు. ఇందులో సుడిగాలి సుధీర్ హీరో. దీనికి ‘వాంటెడ్ పండుగాడు’ అనే పేరును కూడా డిసైడ్ చేశారని అంటున్నారు. వాస్తవానికి రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాంప్రదాయ సంగీతానికి డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే విష్ణుప్రియ ఈ డ్యాన్స్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

Leave a Comment