ఇప్పుడు శ్యామ్ కలిస్తే వెళ్లి హగ్ చేసుకుంటా..: నాగ్ కామెంట్స్ వైరల్

నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరుకొన్ని కారణాలతో విడిపోయారు. అయితే వీరు పెళ్లి చేసుకునే సమయంలో ఎంత హంగామా జరిగిందో.. విడిపోయిన తరువాత కూడా ఈ జంటపై వార్తలు హడావుడి చేస్తూనే ఉన్నాయి. ఒకరినొకరు పీకల్లోతు వరకు ప్రేమించుకున్న ఈ కపుల్స్ సడన్లీగా ఎందుకు విడిపోయిందని ఇప్పటికీ కొందరు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అయితే కొన్నిటికి సమాధానం ఇస్తుండగా.. మరికొన్నింటిని మాత్రం దాటవేస్తున్నారు. ఇక తాజాగా నాగచైతన్యను ఓ మీడియా వాళ్లు సమంత గురించిఓ ప్రశ్న వేశారు. అయితే ఈ కొశ్చెన్ ను దాటవేయకుండా చైతు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.

‘ఏమాయ చేశావే’ సినిమాతో కలిసి నటించిన చైతూ, శామ్ లు ఆ తరువాత ప్రేమ పక్షుల్లాగా మారారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసకున్నారు. అయితే కారణాలు పర్టిక్యులర్ గా తెలియకుండానే వీరు విడిపోయారు. ఒకరిపై ఒకరికి సహృదయమైన భావనే ఉందని, కానీ కలిసుండలేమని చెప్పి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ క్రమంలో మీడియా నుంచి అటు శ్యామ్, ఇటు చైతులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సమంత ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ లో వెళ్లడంతో జాతీయ మీడియా పలు ప్రశ్నలు వేసింది. దీంతో శ్యామ్ అన్నింటికి సమాధానం చెప్పలేకపోయింది.

తాజాగా నాగచైతన్య ‘లాల్ సింగ్ చడ్డూ’ సినిమాలో నటించిన విషయం తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్లో కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కొందరు ‘ఇప్పటికిప్పుడు శామ్ మీకు ఎదురైతే ఏం చేస్తారు..?’ అని అడిగారు. దీంతో చైతూ ఏమాత్రం తడుముకోకుండా ‘హాయ్ చెప్పి హగ్ తీసుకుంటా..’ అని కుండబద్దలు కొట్టారు. ఇక ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఏంటని కొందరు అడగ్గా.. హ్యాపీ అంటూ నవ్వేశాడు.

దీంతో చైతూ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మనసులో శామ్ ఇంకా ఉందని కొందరు కామెంట్ పెడుతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, సమంత మళ్లీ కలుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సమంత సైతం కొన్ని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు గురించి మాట్లాడింది. ‘కాఫీ విత్ కరణ్ జోహార్’ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్.. మీ హజ్బెండ్ అని కరణ్ అనగా.. ‘కాదు.. ఎక్స్ హజ్బెండ్’ అంటుంది. ఏదీ ఏమైనా పరిస్థితులు అనుకూలించి ఇద్దరు మళ్లీ కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Leave a Comment