ఛత్రపతి ‘సూరీడు’ ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛత్రపతి సినిమా ఒక సెన్సేషనల్. అప్పటి వరకు మాస్ సినిమాలు వచ్చినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. డైరెక్టర్ రాజమౌళి తీసిన ఈ సినిమా తరువాత మిగతా డైరెక్టర్లు కూడా మాస్ యాంగిల్ వైపు వెళ్లారు. ఈ సినిమాతో అటు ప్రభాస్, ఇటు రాజమౌళి కెరీర్ మలుపు తిరిగింది. ఇక ఇందులో నటించిన వారికి సైతం ఆ తరువాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ఈసినిమాలో సూరీడు పాత్ర బాగా ఆకట్టుకుంటోంది. సూరీడు పాత్రలో ఓ చిన్నపిల్లవాడు నటిస్తాడు. అతడిని కాట్రాజ్ అనే వ్యక్తి కొట్టడంతో సినిమా మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి అసలు సినిమా మొదలువుతంది. అంటే సినిమాకు కీ పాయింట్ సూరీడు పాత్ర అన్నమాట. ఇంతకీ ఆ సూరీడు పాత్రలో నటించింది ఎవరు..? ఆయన ఇప్పుడేం చేస్తున్నాడో చూద్దాం..

కట్టుబానిసలుగా బుతుకుతున్న వారిలో సూరీడు అనే పిల్లవాడు కూడా ఒకరు. వాళ్ల అమ్మకు కళ్లు కనిపించకపోయేసరికి కాట్రాజ్ దగ్గర పనిచేస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల సూరీడును కాట్రాజ్ కొడతాడు. అప్పటి వరకు భయపడుతూ బతుకుతున్న ప్రభాస్ ఆ పిల్లాడిని కొట్టడంతో ఆవేశపూరితంగా మారుతాడు. అక్కడి నుంచి బానిస బతుకుల నుంచి విముక్తులవుతారు. అయితే మొత్తంగా ఐదు నిమిషాల పాటు సూరీడు పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ తరువాత ఆ పాత్రకు ప్రాధాన్యం కనిపించదు.

ఈ సూరీడు పాత్రలో నటించిన వ్యక్తి పేరు భశ్వంత్. ఛత్రపతి సినిమా వరకు.. ఆ తరువాత భశ్వంత్ చాలా సినిమాల్లో నటించారు. కానీ ఛత్రపతి మాత్రమే ఆయనకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమా తరువాత భశ్వంత్ చాలా సినిమాల్లో కనిపించినా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే చైల్డ్ ఆర్టిస్టుగా కొన్నాళ్లు సినిమాల్లో నటించిన భశ్వంత్ ఆ తరువాత పై చదువుల కోసం లండన్ వెళ్లాడు. ఛత్రపతి సినిమా వచ్చి 18 ఏళ్లు అవుతోంది. అంటే సూరీడు ఇఫ్పుడు ఎంత వయసు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇటీవల భశ్వంత్ కొన్ని ఫొటోలను నెట్లోకి పంపాడు. ఇందులో అనితా చౌదరితో కలిసి ఉన్న ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ఛత్రపతి సినిమాలో సూరీడుకు తల్లిగా అనితా చౌదరి నటించింది. అందుకు భశ్వంత్ పెద్దయ్యాక మొదటిసారిగా ఆమెను కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న సూరీడు.. పెద్ద సూరీడు అంటూ ఆక్ష్న ఫొటోలను కంపేర్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చిన వాళ్లు చాలా మంది హీరోలుగా ఎదిగారు. మరి భశ్వంత్ హీరోగా ఏ సినిమాలో కనిపిస్తాడో చూడాలి.

Leave a Comment