బాయ్ ఫ్రెండ్ కోసం పిచ్చ కొట్టుడు..

ఓ రాధ ఇద్దరు కృష్ణులు అనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు మాత్రం ఓ కృష్ణ ఇద్దరు రాధలు. ఇది వినడానికి అర్థం కావటంలేదు కదా..కాస్త వివరంగా తెలుసుకుందాం.. ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు బజారు లో కొట్టుకున్నట్లు బూతులు తిడుతూ మరీ కొట్టుకున్నారు..అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి లుక్ వేసుకోండి..

విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకుంది.ఆర్టీసీ బస్టాండ్ లో అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో జుట్టు పీక్కొని చితకబాదుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు అబ్బాయిలు వచ్చి వారిని అడ్డుకున్నారు. కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. పోలీసులు రంగంలోకి దిగి గొడవ ను సర్దుమనిగేలా చేశారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి చదివిస్తే కాలేజీలకు వెళ్లి ప్రేమ పాటలు తప్ప చదువుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, స్థానికులు చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.. కాలెజి యాజమాన్యం ఎలా స్పందిస్తుందొ చూడాలి..

Leave a Comment