చిరు సినిమాలో సల్మాన్..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీమెక్ సినిమాల లో నటిస్తూ వరుస హిట్ లను అందుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నటిస్తున్న సినిమా లో బాలివుడ్ హీరో లతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. అందుకోసం బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక పాత్ర చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ కీలక పాత్ర చేయనున్నారు.

మోహన్‌ లాల్‌ నటించిన మలయాళ మూవీ ‘లూసీఫర్‌’కి రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ‘లూసీఫర్‌’లో పృథ్వీరాజ్‌ చేసిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్‌ చేయనున్నట్లు సమాచారం. ‘అంతిమ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఈ హీరో ‘గాడ్‌ఫాదర్‌’లో నటించనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు..చిరు తో పాటుగా వెంకీ సినిమా కూడా చేస్తున్నారని సల్లూ భాయ్ చెప్పాడు.. ఈ రెండు సినిమా లలో అతని పాత్ర హైలెట్ అయ్యితే మాత్రం అతని పేరు తెలుగులో వినిపిస్తుందన్నమాట.

Leave a Comment