అలర్ట్.. పావురం కాలికి చైనా ట్యాగ్..

చైనా ట్యాగ్ ఉన్నా ఒక పావురం ఇప్పుడు కలకలం రేపుతుంది.. ఆ పావురం ఎక్కడ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది. దాని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అంశం ఇప్పుడు అందరి లో భయాన్ని నింపింది. వివరాల్లొకి వెళితే.. ఒడిశాలో.. కాలికి చైనా ట్యాగ్ ఉన్న ఓ పావురం కలకలం రేపింది. సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో..గాయంతో ఓ పావురం కింద పడిపోయింది.

ఆ పావురాన్ని రక్షించేందుకు సర్బేశ్వర్ చొత్రాయ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కాలికి చైనా ట్యాగ్ ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలిసులకు సమాచారం అందించారు..సర్బేశ్వర్ సమాచారంతో అధికారులు హూటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

Leave a Comment