వర్మ వర్సెస్ వైసిపి.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు..

టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ ట్వీట్‌ కు ఏపీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హీరోలకు నిర్మాతలకు రెమ్యునరేషన్ ఫార్ములాను ఆయన వివరించాడు.ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని.. ఇది 1970 సినిమాటో గ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయని వెల్లడించారు.

ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారని… సినిమా ఒక వస్తువు కాదని చురకలు అంటించారు. అది వినోద సేవ మాత్రమేనని… ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారని సెటైర్ వేశారు.. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..

Leave a Comment