మరోసారి పెద్ద మనసు ఛాటుకున్న సోనూసూద్..

కరోనా విజ్రుంభిస్తున్న నేపథ్యం లో హీరో సొనూ సూద్ ముందుకు వచ్చి అందరికి సాయాన్ని అందించారు. ప్రజలకు సాయం చేయడం కోసం ఒక ట్రస్ట్ ను స్టార్ట్ చేశాడు. దాని ద్వారా సాయం కోరిన వారికి లేదనకుండా సాయం చేస్తున్నారు.ఇప్పుడు సోనూసూద్ ఎంతోమంది గుండెల్లో దేవుడిగా మారిపోయాడు. తాజాగా మరో సేవా కార్యక్రమంతో తన గొప్పమనుసుని చాటుకున్నాడు సోనూసూద్.

పంజాబ్ లోని మోగా జిల్లాలో సుమారు 40-45 గ్రామాల విద్యార్థినులు చదువాబుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఇది తెలుసుకున్న సోనూసూద్ ‘మోగా కీ బేటి’ క్యాంపెయిన్‌లో భాగంగా మోగా పట్టణంలో 1000 మంది విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలకు తన సోదరి మాళవిక సూద్ సచార్‌తో కలిసి సైకిళ్లు పంపిణీ చేశాడు. ఈ క్యాంపైన్ తో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న ఎంతో మంది విద్యార్థినులకు సైకిల్స్ అందాయి. 8 నుంచి 12వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థినులకు సాయం చేయడమే లక్ష్యంగా సైకిళ్లను పంపిణీ చేశామని, సామాజిక కార్యకర్తలకు కూడా సైకిళ్లు అందించామని సోనూసూద్ తెలిపాడు..

Leave a Comment