ఫ్యాన్స్ కు సారీ చెప్పిన బన్నీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా పుష్ప..ఈ సినిమాకు జనాల నుంచి మంచి స్పందన వస్తుంది.సరి కొత్త కథనం తో పాటు అల్లు అర్జున్ కొత్త లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతూంది అని అల్లు అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా చిత్రయూనిట్ పై కేసులు నమొదయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి..ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు.అల్లు అర్జున్‌తో ఫొటోషూట్‌ ఉందని తెలుసుకొని సోమవారం గీతాఆర్ట్స్‌ కార్యాలయం వద్దకు బన్నీ అభిమానులు భారీగా చేరుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చేశారు. అయితే వారిని నిలువరించే క్రమంలో స్వల్ప లాఠీఛార్జ్‌ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై తాజాగా బన్నీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. నా అభిమానులు ఫ్యాన్స్‌ మీట్‌ ఈవెంట్‌కు వచ్చి గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నా బృందం వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి అని బన్నీ ట్వీట్‌ పేర్కొన్నారు..ఇది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

Leave a Comment